బన్నీ లేకుంటే బుట్టబొమ్మ ఉండేది కాదట.. దర్శకుడికి తెలియకుండా..
టాలీవుడ్ టాప్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన చిత్రం అల.. వైకుంఠపురములో.. ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి క్రేజ్ వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ ట్రాక్ లోకి వచ్చేశారు.
ఇక ముఖ్యంగా సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాతో అందరికంటే ఎక్కువ క్రేజ్ అందుకున్నాడని చెప్పవచ్చు. అతను కంపోజ్ చేసిన సాంగ్స్ ప్రతి ఒక్కటి యూ ట్యూబ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ఇటీవల బుట్టబొమ్మ సాంగ్ కూడా యూ ట్యూబ్ లో 150మిలియన్ల వ్యూవ్స్ ని అందుకొని బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఆ సాంగ్ సినిమాలోకి రావడానికి అసలు కారణం కథానాయకుడు అల్లు అర్జున్.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు థమన్ సినిమాకు సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుతూ.. బుట్ట బొమ్మ సాంగ్ అసలు మొదట ఈ సినిమా కోసం అనుకోలేదని అన్నాడు. ఒక ట్యూన్ సరదాగా బన్నీకి వినిపిస్తుండగా దర్శకుడి కంటే ముందే ఒకే చేశాడని చెప్పాడు. అప్పటికి ఆ విషయం త్రివిక్రమ్ గారికి తెలియదని, ఆ తరువాత రెండు రోజుల్లో ఫుల్ సాంగ్ సెట్టయ్యిందని అన్నారు. అయితే..ఆ సాంగ్ అంతగా క్లిక్కవ్వడానికి కారణం బన్నీ డ్యాన్స్ కూడా ముఖ్య కారణమని థమన్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











