మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన థమన్.. అది నిజం కాదట
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో అభిమానులకు మంచి కిక్కిచ్చిన మహేష్ అదే తరహాలో వచ్చే సంక్రాంతికి కూడా మరో మంచి సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో చేయనున్న సర్కారు వారి పాట సినిమాను అసలైతే వచ్చే పొంగల్ కి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కరోనా వైరస్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
సమ్మర్ లో కూడా సర్కారు వారి పాట వచ్చే అవకాశం లేదు. రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ లో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. అది కూడా పరిస్థితులు అనుకూలిస్తేనే. అయితే సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ ని ఈ దసరాకు రిలీజ్ చేయనున్నట్లు ఒక టాక్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండడంతో వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్లారిటీ ఇచ్చాడు.

నో బ్రో.. ఇది రాంగ్ న్యూస్. మేము ప్రస్తుతం పాటలను పూర్తి చేస్తున్నాం. షూటింగ్ కి వెళ్లేముందు సినిమాకు సంబంధించిన సాంగ్స్ రిలీజ్ అవుతాయని థమన్ వివరణ ఇచ్చారు. మొన్నటివరకు కోటి ఆశలు పెట్టికున్న అభిమానులకు నిజంగా ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి దసరాకి సాంగ్ కాకుండా మరేదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.
ప్రస్తుతం సర్కారు వారి పాటను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించడానికి దర్శకుడు పరశురామ్ భారీగా ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించే అవకాశం ఉన్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











