Game Changer: మెగా అభిమానులకు నిరాశ తప్పదా! ఇంతకీ త‌మ‌న్ ఏమన్నారంటే?

Game Changer: గోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌ ఈగర్ గా వేయిట్ చేస్తున్న మూవీస్ లో గేమ్‌ ఛేంజర్‌(Game Changer). ఈ మూవీ హీరో రామ్​ చరణ్ (Ram Charan)​​, త‌మిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)కాంబోలో రానుండ‌టంతో మూవీపై భారీ అంచ‌నాలు పెరిగాయి. అయితే.. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్ విడుదల చేశారు. వాటికి ఫ్యాన్స్ నుంచి ఎనలేని ఆదరణ వచ్చింది. తాజాగా దసరా పండుగ సందర్బంగా మెగా ఫ్యాన్ ను ఎంటర్టైన్ చేయడానికి గేమ్ చేంజర్ మూవీ నుంచి కేజ్రీ అప్టేడ్ ఉండబోతుందనీ, ఫ్యాన్స్ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ, వారందరికీ షాక్ ఇస్తూ తమన్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఇంతకీ పోస్ట్ ఏంటో ఓ లూక్కేయండి.

గ్లోబల్ స్టార్ రాంచరణ్, అందాల భామ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న మూవీ ' గేమ్ ఛేంజర్'. ఈ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

Music Director Thaman hints on game changer teaser postponement from dussehra

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా అప్డేట్ కు కేజ్రీ రెస్పాన్ వస్తుంది. ఇటీవల విడుదలైన సెకండ్ సింగిల్ 'రా మ‌చ్చా మ‌చ్చా' (Raa Macha Macha) అనే పాట ప్రోమో సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల అయింది. ఈ పాట‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అయితే.. ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి మూడో పాట‌ను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ చెప్పేశాడు.

దీంతో దసరా పండుగ కానుక మూడో పాట గ్లిల్స్ లేదా ద‌స‌రాకు టీజ‌ర్ ను విడుదల చేశారని మూవీ లవర్స్ తెగ సంబురపడ్డారు. కానీ, ఈ తరుణంలో ఈ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ టీజర్, అటు సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి.. మెగా ఫ్యాన్స్ కు షాకిచ్చారు. ఇంతకీ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ఏం కామెంట్స్ చేశారంటే ?

Music Director Thaman hints on game changer teaser postponement from dussehra

'దసరాకు టీజర్‌ రాలేదని నిరాశపడొద్దు ఫ్రెండ్స్‌. గేమ్ చేంజర్ టీమ్‌ కంటీన్యూ గా ఆ పనుల్లోనే ఉంది. ఇప్పటికే సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ ఫైనల్‌ ఎడిటింగ్‌, డబ్బింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ పనులు షూరు అయ్యాయి. ప్రతి నెలా ఒక లిరికల్‌ పాటను విడుదల చేయడం కోసం అన్ని పాటలకు లిరిక్స్‌ వర్క్స్‌ పూర్తి చేశాం. మూడో సాంగ్ ఈ నెల (అక్టోబ‌ర్) 30న ప్రేక్ష‌కుల వ‌స్తుంది. ఇక ఈ సినిమా డిసెంబ‌ర్ 20న లేదంటే క్రిస్‌మ‌స్ రోజున ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది' అని త‌మ‌న్ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Read more about: game changer ram charan thaman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X