'వకీల్ సాబ్'లో రొమాంటిక్ టచ్.. క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. మొత్తానికి సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయడానికి రెడీ అయ్యారు. సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక సినిమా బిజినెస్ కూడా ఈజీగా 100కోట్లు దాటేస్తుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సంగీత దర్శకుడు థమన్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు న్నిర్మించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా యొక్క అప్డేట్స్ సోషల్ మీడియాలో అయితే బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా థమన్ ఒక అప్డేట్ ఇవ్వనున్నట్లు ఒక పోస్ట్ పెట్టాడు. అయితే అది వకీల్ సాబ్ కు సంబంధించినదేనని టాక్ వస్తోంది.

వకీల్ సాబ్ నుంచి ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ ను విడుదల చేయడానికి రేడి అయినట్లు సమాచారం. సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో మెయిన్ లీడ్ మధ్యన ఒక రొమాంటిక్ లవ్ సాంగ్ కూడా ఉంటుందట. ఆ సాంగ్ ను థమన్ హార్ట్ కు టచ్ అయ్యే విధంగా కంపోజ్ చేసినట్లు టాక్ వస్తోంది. మరి ఆ సాంగ్ ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి. థమన్ నెక్స్ట్ మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ కు కూడా మ్యూజిక్ అందించబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











