అందుకే బ్రేకప్స్, విడాకులు.. అమ్మాయిలకు మ్యారేజ్ అంటే.. తమన్ సంచలన వ్యాఖ్యలు

దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడేస్తుంటారు. తాను చెప్పాలనుకొన్న విషయాలను ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతాడు. ఇటీవల సినిమాలపై నెగిటివ్ రివ్యూలు, కామెంట్స్ చేసే వారిపై ఆయన మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింప జేసేలా చేసింది. అయితే తాజాగా యూట్యూబర్ నిఖిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైవాహిక వ్యవస్థ గురించి, నేటితరం అభిరుచుల గురించి ఆయన మాట్లాడుతూ..

ప్రస్తుత సమాజంలో ఏ ఒక్కరు కూడా పెళ్లి చూసుకోవద్దనేది నా అభిప్రాయం. ఇద్దరు కలిసి జీవించడానికి పెళ్లి అనేది చాలా కష్టంగా మారుతున్నది. లైఫ్‌లో అమ్మాయిలు స్వతంత్రంగా బతకాలని అనుకొంటున్నారు. వాళ్లు ఒకరి కింద జీవించాలని కోరుకోవడం లేదు. ప్రస్తుతం వివాహ వ్యవస్థపై నమ్మకం పోతున్నది. అందరూ ఇండిపెండెంట్‌గా జీవించాలని కోరుకొంటున్నారు అని తమన్ అన్నారు.

Music Director Thaman S comments on Marriages Breakups and Divorce in latest Prodcost Interview

కోవిడ్ తర్వాత ప్రజల జీవన విధానంలో అనేక మార్పులు, ఊహించని విషయాలు చోటుచేసుకొన్నాయి. మానవ సంబంధాలను దెబ్బ తీయడానికి ఇన్స్‌టాగ్రామ్ ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను. నేను సరైనా మాటలతో ఎక్స్‌ప్రెస్ చేయలేకోపోతున్నానేమో కానీ.. సోషల్ మీడియా వల్ల అనేక దుష్పరిమాణాలు వ్యక్తమవుతున్నాయనే విధంగా తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఇన్స్‌టాగ్రామ్‌లో కేవలం బ్యూటీఫుల్ థింగ్స్ మాత్రమే పోస్టు చేస్తున్నాం. మన జీవితంలో జరుగుతున్న అనేక విషయాలను విస్మరిస్తున్నాం. ఒక పాజిటివ్ రీల్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నామో ఎవరికీ తెలియదు. కేవలం పాజిటివ్ కోణాన్ని మాత్రమే చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమాజంలో నేను మ్యారేజ్ చేసుకోవడాన్ని రెకమెండ్ చేయను అని తమన్ అన్నారు.

Music Director Thaman S comments on Marriages Breakups and Divorce in latest Prodcost Interview

వైవాహిక జీవితాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అందుకే ఆ వ్యవస్థ చాలా టఫ్‌గా మారింది. చాలా విషయాలను నేను గ్రహించిన తర్వాత.. చూసిన తర్వాత ఎవరైనా మ్యారేజ్ చేసుకొంటున్నారా? అంటే వద్దనే చెబుతాను. ఎందకంటే నేను చాలా మందిని చూస్తున్నాను. పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు తీసుకొంటున్నారు. వివాహం జరిగిన ఐదారు నెలలకే డైవోర్స్ తీసుకొంటున్నామనే విషయాలు బాధ కలిగిస్తున్నాయి. దాంపత్య జీవితంలోని మంచి లక్షణాలను అర్ధం చేసుకొనే అవగాహన ఈతరం వారిలో లేవు అని తమన్ పేర్కొన్నారు.

తమన్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రం ఘన విజయం సాధించాయి. ఆయన ప్రస్తుతం తెలుసు కదా.. ది రాజా సాబ్, ఓజీ, అఖండ 2, శబ్దం సినిమాలకు పని చేస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులను ప్రకటించాల్సినవి ఉన్నాయి. ఆయన అందిస్తున్న పాటలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: thaman s tollywood og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X