SS Thaman కి కరోనా పాజిటివ్.. ఇక వారందరిలో టెన్షన్?
టాలీవుడ్ లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రవాణా సోకిన అందరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ వుండగా తాజాగా సంగీత దర్శకుడు తమన్ కి కూడా కొనసాగినట్లు తెలుస్తోంది వివరాల్లోకి వెళితే

మంచు లక్ష్మి - మహేష్ బాబుకు కూడా
బాలీవుడ్ లో ఎలా అయితే దాదాపు చాలా మందికి కరోనా సోకినట్లు ప్రకటిస్తూ వచ్చారో ఇప్పుడు టాలీవుడ్లో కూడా అదే పరిస్థితి నెలకొంటోంది. టాలీవుడ్ లో ముందుగా మంచు లక్ష్మి తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను ప్రస్తుతానికి ఐసోలేషన్ లో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనకు కరోనా సోకిందని గురువారం పొద్దు పోయాక ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా సోకింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మాస్కు ధరించాలి అని సూపర్ స్టార్ మహేష్ బాబు కోరారు.

నితిన్ భార్యకు కూడా
అలాగే హీరో నితిన్ భార్య శాలిని కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారించ పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతానికి సొంత ఇంట్లోనే ఒక గదిలో ఐసోలేషన్ లో ఉన్నారు. శుక్రవారం నాడు ఆమె పుట్టిన రోజు కావడంతో ఆ వేడుకలను నితిన్ సహా కుటుంబ సభ్యులు బయట నుంచి జరుపుకుంటూ గదిలో ఉన్న ఆమె తో మాట్లాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఇప్పుడు హ్యాపెనింగ్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి కరోనా సోకినట్లు సమాచారం అందుతుంది.

అధికారికంగా ప్రకటించలేదు కానీ
తనకు కరోనా సోకిందని థమన్ అధికారికంగా ప్రకటన ఇవ్వకున్నప్పటికీ ఆయన సన్నిహితుల ద్వారా ఈ విషయం బయటికి వచ్చినట్లు వినికిడి. ఆయనకు స్వల్ప లక్షణాలతో కోవిడ్ నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది. ఇక థమన్ కి కోవిడ్ సోకిందన్న వార్త తెలుకున్న అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు బాబీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా అందరూ విషెష్ తెలియజేస్తున్నారు.

దుబాయ్ లో మహేష్ ను కలిసి
నిజానికి కొద్ది రోజుల క్రితం థమన్ దుబాయ్ లో ఉన్న మహేష్ బాబుని త్రివిక్రమ్, నాగ వంశీ తో మర్యాద పూర్వకంగా కలిశారు. నిన్న మహేష్ బాబు కరోనా సోకినట్టు ప్రకటించగా థమన్ కూడా టెస్ట్ చేయించుకున్నాడనీ ఈ క్రమంలోనే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది అని అంటున్నారు. మరో విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం థమన్ తన కొత్త మూవీ యూనిట్ సభ్యులతో గడిపారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Recommended Video

వారందరికీ టెన్షన్
ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడిగా థమన్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో థమన్, అనుదీప్, నవీన్ పోలిశెట్టి, శివకార్తికేయన్ లు ఇక పార్టీలో కలవడం జరిగింది. ఇప్పుడు థమన్ కి కరోనా సోకిన నేపథ్యంలో వీరందరిలో టెన్షన్ నెలకొననుంది. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. బడా హీరోల సినిమాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











