800 trailer మరో 100 ఏళ్లైనా సచిన్ లాంటి క్రికెటర్ పుట్టలేడు..నా బౌలింగ్‌ను మాస్టర్ బ్లాస్టర్ అలా..ముత్తయ్య

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు సొంతం చేసుకొన్న స్పిన్నర్, లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా 800. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను దేశవ్యాప్తంగా శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ రిలీజ్ చేస్తూ, ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వివాదాలు, ఎమోషన్స్, సెన్సేషనల్ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు.

బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. ముంబైలో సెప్టెంబర్ 5వ తేదీన సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా '800' ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రికెటర్ సనత్ జయసూర్య, '800' చిత్రనిర్మాత వివేక్ రంగాచారి, మహిమా నంబియార్, యు.ఎఫ్.ఓ మూవీస్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ..

Muttiah Muralidharan says We will not see crickter like Sachin Tendulkar in next 100 years

శ్రీలంకలో పౌరసత్వం లేకుండా బానిసలుగా బతకడానికి వచ్చిన వారికి చాలా కష్టం అంటూ నాజర్ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ చాలా ఎమోషనల్‌గా ప్రారంభమైంది. శ్రీలంకలో ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం జరిగిన మారణహోమం, బాంబు పేలుళ్ల సంఘటనలను చాలా ఉద్వేగంగా తెరకెక్కించినట్టు ట్రైలర్‌లో కనిపించింది. ఈ రోజు దేశం తిరిగి చూసేలా ఓ పేదవాడు గొప్పవాడు అయ్యాడు. నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న బెస్ట్ బౌలర్ అంటూ ప్రశంసలు అందుకోనే సీన్ అద్బుతంగా కనిపించింది.

ముత్తయ మురళీధరన్ విసిరిన బాల్‌కు తిరుగులేని పరిస్థితుల్లో చెకింగ్ ఆరోపణలు రావడంతో లెగ్ స్పిన్నర్ క్రీడా జీవితం ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి సమయంలో ఆస్ట్రేలియా ఆరోపణలకు క్రికెట్ నిపుణుల ముందు అగ్ని పరీక్షకు సిద్దమవ్వడం క్రీడా రంగంలో ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు. నీకు తమిళం మాట్లాడటం వచ్చా? కొందరు అవమానించడం ట్రైలర్‌లో ఎమోషనల్‌గా ఉంది.

Muttiah Muralidharan says We will not see crickter like Sachin Tendulkar in next 100 years

800 ట్రైలర్ ఆవిష్కణ అనంతరం ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ.. నా కోసం ఇక్కడికి వచ్చిన, మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ కి థాంక్స్. నేను కూడా సచిన్ ఫ్యాన్. క్రికెట్ లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు. మరో 100 ఏళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు. క్రికెట్ ఎలా ఆడాలో, ఎంత వినమ్రంగా ఉండాలో సచిన్ నేర్పించారు. ఆయన ఎప్పటికీ బెస్ట్. మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు. ఆట ఆడేటప్పుడు ఎంజాయ్ చేస్తుంటే ఫలితం గురించి ఆలోచించం అని ముత్తయ్య మురళీధరన్ అన్నారు.

నేటి తరం క్రికెటర్లకు నేను ఇచ్చే సలహా ఏమిటంటే... పెర్ఫార్మన్స్ గురించి ఆలోచించడం మానేసి ఎంజాయ్ చేయమని చెబుతా. నేను 10, 12 ఏళ్ళు హాస్టల్‌లో ఉన్నాను. అందుకని, ఎప్పుడూ నవ్వుతూ షేరింగ్ చేసుకోవడం అలవాటు అయ్యింది. నేను బౌలింగ్ చేసినప్పుడు రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు. కానీ, నా బౌలింగ్ శైలిని పట్టుకోలేదు. రాహుల్ ద్రావిడ్ కూడా! సచిన్ మాత్రం నానా ఆటను పూర్తిగా చదివేశాడు అని ముత్తయ మురళీధరన్ అన్నారు.

Muttiah Muralidharan says We will not see crickter like Sachin Tendulkar in next 100 years

చిత్ర సమర్పకులు శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ''ఈ సినిమాను విడుదల చేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. భారతరత్న సచిన్ గారు ట్రైలర్ విడుదల చేశారు. ఆయనకు థాంక్స్. ఎమోషనల్ జర్నీ ఉన్న ఫిల్మ్ ఇది. ముత్తయ్య మురళీధరన్ గారి బయోపిక్ ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకుంటుంది అని అన్నారు.

దర్శకుడు ఎంఎస్ శ్రీపతి మాట్లాడుతూ... ''ఈ క్షణాల కోసం మేం చాలా రోజులు ఎదురు చూశాం. ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు... లెజెండరీ క్రికెటర్ బయోపిక్ కనుక ఆ స్థాయిలో క్వాలిటీగా ఉండాలని అనుకున్నా. నా టెక్నికల్ టీమ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. కులం, మతం, భాష, దేశం వంటి బౌండరీలను మన మనుషులే క్రియేట్ చేశారు. మానవత్వం కంటే అవి ఏవీ గొప్పవి కావు. ఇది మానవత్వంతో కూడిన కథ. ఓ హ్యూమన్ స్టోరీ. తనకు ఎదురైన ఇబ్బందులను దాటుకుని, తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న లెజెండరీ క్రికెటర్ కథ.

Muttiah Muralidharan says We will not see crickter like Sachin Tendulkar in next 100 years

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' ట్రైలర్ విడుదల చేయడానికి మరో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కంటే సరైన వ్యక్తి ఎవరూ లేరు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. వారిలో నేనూ ఒకడిని. గోవా షూటింగుకు వెళ్ళినప్పుడు సచిన్ ఫెవరేట్ రెస్టారెంట్ అని తెలిసి మేమూ వెళ్లాం. కింగ్ క్రాబ్ సచిన్ ఫెవరేట్ ఫుడ్ అని తెలిసి షాక్ అయ్యా. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వెంకట్ ప్రభు, పా రంజిత్, ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికి కారణమైన వివేక్ రంగాచారికి థాంక్స్. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. మాపై నమ్మకం ఉంచిన ఆయనకు థాంక్స్. ఆయన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మాకు ఎంతో మద్దతు ఇస్తున్నారు'' అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X