ఆ యాంకర్‌తో అక్రమ సంబంధం.. యువ హీరోపై భార్య సంచలన ఆరోపణలు
తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ హీరో ధర్మ మహేష్‌కు, ఆయన భార్యకు మద్య దాంపత్య సంబంధిత విభేదాలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది డ్రింకర్ సాయి అనే సినిమాతో నటుడు ధర్మ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్యతో వైవాహిక సంబంధాలు దెబ్బ తినడం వివాదంగా మారింది. తమ మధ్య వివాదానికి అసలు కారణాలను వెల్లడిస్తూ భార్య పలు టెలివిజన్ ఛానెల్స్‌కు తన గోడు వెళ్లబోసుకొన్నారు. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..
2013 సంవత్సరంలో తనకు ధర్మ మహేష్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకొన్నాం. అయితే నేను గర్బవతిని అయ్యేంత వరకు నాతో బాగానే ఉన్నాడు. నా బిజినెస్ బాగానే కొనసాగుతుండటంతో ఆనందంగా గడిపాం. ఎప్పుడైతే నా కడుపులో బిడ్డ ఉండగానే తన ప్రవర్తన మారిపోయింది. సినీ రంగంలోని అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుుకొని తన కడుపులోని బిడ్డను, నన్ను చంపేందుకు ప్రయత్నించారు అని భార్య గౌతమి ఆరోపించింది.

నా భర్తకు ఓ యాంకర్‌తో అక్రమ సంబంధం ఉంది. చాలా మంది పెళ్లైన యాంకర్లతో షికార్లు చేస్తుంటారు. వారి పేర్లను బయట పెట్టడం ఇష్టం లేదు. మా ఫ్లాట్‌లో అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో పార్టీలు చేసుకొంటాడు. ప్రెగ్నెన్సీ సమయంలో వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకొన్నాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో విడాకులు తీసుకొందామని అనుకొన్నాను. పెళ్లి రద్దు చేసుకోవాలని భావించా. కానీ తప్పైందని ఒప్పుకోవడంతో నా మనసు మార్చకొన్నాను అని ఆమె తన బాధలను వివరిచింది.
ఆ తర్వాత కూడా ధర్మ మహేష్ అదే తీరుగా ప్రవర్థించాడు. దాంతో తాను చేసేదేమీ లేక నా బిడ్డ గురించి ఆలోచించాను. నా భర్త ఫ్యామిలీ పెట్టిన అవమానాలను భరించాను. నా భర్త నన్ను ఆర్థికంగా కూడా తనని మోసం చేశాడు. నా బిజినెస్ ద్వారా వచ్చే సంపాదనతో అతనికి అండగా నిలిచాను. ఆ తర్వాత అతను నా వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకొని నిర్లక్ష్యం చేశాడు అని ఆమె చెప్పారు.
వరకట్నం కింద నా తండ్రి ఇచ్చిన డబ్బును కూడా అతడు వాడుకొన్నాడు. నాతో విడాకులు తీసుకోవడానికి ఆయన సిద్దంగా లేడు. నేను కోర్టుకు వెళితే.. బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అందుకే ప్రాణ భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు న్యాయం చేయాలని కోరుకొంటున్నాను. నా బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలని కోరుకొంటున్నాను. ధర్మ నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. అతడితో నాకు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం ఇష్టం లేదు అని ఆమె తెలిపారు.
తనపై లేనిపోని ఆరోపణలను నా భర్త చేస్తున్నాడు. డబ్బు కోసమే విడాకులు తీసుకొంటున్నాను. విడాకుల ద్వారా లభించే భరణ కోసమే ఈ గొడవ చేస్తున్నట్టు ఆయన చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవు. చట్టం, న్యాయం ప్రకారం నాకు మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది అని గౌతమి అన్నారు.


Click it and Unblock the Notifications











