పవన్ కల్యాణ్ అభిమానుల మృతి.. మైత్రీ మూవీస్ 2 లక్షల ఆర్థిక సహాయం
పవర్ స్టార్ బర్త్ డే వేడుకల్లో జరిగిన అపశృతిపై టాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పవన్ కల్యాణ్ జన్మదినం రోజును పురస్కరించుకొని బ్యానర్లు, ఫ్లెక్సీలు కడుతున్న యువకుల్లో ముగ్గురు మరణించడం, నలుగురు గాయపడటం తీవ్ర విషాదంగా మారింది. కుప్పం నియోజకవర్గంలో ఈ దుర్ఘటన జరిగిన వెంటనే బాధిత కుటుంబాలకు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
మరణించిన పవన్ అభిమానుల కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ ముందుకొచ్చారు. మరణించిన యువకుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అదించనున్నట్టు మైత్రీ మూవీస్ ప్రకటించింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన యువకులు మరణించడంపై మైత్రీ మూవీస్ నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తమ ప్రకటనలో ఆకాంక్షించారు.

ఇప్పటికే వకీల్ సాబ్ యూనిట్ కూడా మృతులకు ఆర్థిక పరిహారం చెల్లించారు. వకీల్ సాబ్ యూనిట్ తరుఫున శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ అభిమానులు మృతిపై మెగా హీరోలు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, బన్నీ తదితరులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











