For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mythri Movie Makers : కంటెట్ లీక్ మీద సీరియస్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరైనా వదలమంటూ ప్రకటన!

  |

  ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా కొనసాగుతోంది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. వరుసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారుతున్న పెద్ద సినిమాలకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఈ పెద్ద సినిమాల నుంచి కంటెంట్ లీక్ కావడం, ఆన్లైన్ లో ప్రసారం కావడం వంటి విషయాల మీద సీరియస్ గా తీసుకున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

  మైత్రి మూవీ మేకర్స్ సీరియస్

  మైత్రి మూవీ మేకర్స్ సీరియస్

  టాలీవుడ్ లో స్థాపించిన కొన్ని రోజులకే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మంచి పేరు తెచ్చుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ, చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో అనతికాలంలోనే బడా ప్రొడక్షన్ హౌస్ గా నిలబడగలిగింది.. ఎలా అయినా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలతో సినిమాలు చేయాలని భావిస్తున్న నిర్మాణ సంస్థ ఇప్పటికే సినిమాలు చేసిన హీరోలతో కాకుండా కొత్త హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ సంస్థ మహేష్ బాబుతో సర్కారు వారి పాట, అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలను ఏకకాలంలో నిర్మిస్తోంది.

  రంగంలోకి దిగి

  రంగంలోకి దిగి

  అయితే ఈ రెండు సినిమాలను సింగిల్ గా నిర్మించకపోయినా ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి భాగస్వామిగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సర్కారు వారి పాట అలాగే పుష్పకి సంబంధించిన కంటెంట్ లీక్ అవుతూ ఉండటం అటు మహేష్ బాబు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి టెన్షన్ రేకెత్తించింది అని చెప్పక తప్పదు. అయితే నిర్మాణ సంస్థ ఇంతలా కంటెంట్ లీక్ అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నామని ప్రకటించింది.

  మెటీరియల్ ఆన్లైన్ లో లీక్

  మెటీరియల్ ఆన్లైన్ లో లీక్

  అంతేకాక ఈరోజు కొద్దిసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మా సినిమాలకు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ లో లీక్ కావడం వల్ల మేము బాగా డిస్టర్బ్ అయ్యాము, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈ విషయాలకు సంబంధించి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు కూడా చేశామని ప్రకటనలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పేర్కొంది. ఎవరైతే ఈ నేరాలకు పాల్పడ్డారు వాళ్ళు కచ్చితంగా మన దేశ చట్టాల ప్రకారం శిక్షార్హులు అవుతారని హెచ్చరించింది. అలాగే పైరసీని కచ్చితంగా ఎంకరేజ్ చేయకూడదు అని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కోరింది.

  రిలీజ్ కంటే ముందే లీక్

  రిలీజ్ కంటే ముందే లీక్

  సర్కారు వారి పాట, పుష్ప కి సంబంధించిన ఫోటోలు వీడియోలు అలాగే పాటలు బయటకు రిలీజ్ కంటే ముందే లీక్ కావడం జరిగింది. ఈ విషయంలో మేము చాలా డిస్టర్బ్ గా ఉన్నాము అని ప్రకటనలో పేర్కొన్నారు.. ఈ కంటెంట్ లీక్ చేసి అందులో ఉన్న శాడిస్టిక్ ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు అనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఆడియన్స్ యొక్క సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్స్ నీ ఎగ్జైట్మెంట్ నీ చంపేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉందని అందుకే ఇక మీదట ఇలాంటి పనులు జరగకుండా ఉండేందుకు అనుగుణంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

  Greatest Indian Classics - Episode 1 | Sagara Sangamam, కమల్ నట విశ్వరూపం || Filmibeat Telugu
  ఎవరైనా వదిలిపెట్టం

  ఎవరైనా వదిలిపెట్టం

  వీటికి కారణం ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేశామని పేర్కొంది. కచ్చితంగా ఇలాంటి పనులకు పాల్పడిన వారి మీద శిక్ష పడే లాగా మేము పోలీసు వారితో సంప్రదింపులు జరుపుతామని పేర్కొంది.. అలాగే దీని వెనక ఎవరు ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా అందరినీ శిక్షిస్తామని కూడా హెచ్చరించడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాలు మాత్రమే కాకుండా బాలకృష్ణ, చిరంజీవి వంటి బడా హీరోలతో కూడా సినిమాలు ప్లాన్ చేసి ఉండడం ఆసక్తికరంగా మారింది.

  English summary
  Mythri Movie Makers lodged a police complaint after Sarkaaru Vaari Paata and Pushpa’s material leaked online.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X