Pushpa 2 : పుష్ప 2 మళ్లీ వాయిదా?

సరిగ్గా మూడేళ్ల క్రితం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 1980వ దశకంలో శేషాచలం కొండల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ , ఆ ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఇతివృత్తంతో పుష్ప తెరకెక్కింది. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో స్థానం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప 2ని తొలుత ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ డేట్‌ని లాక్ చేసేసింది. కానీ అనూహ్యంగా డిసెంబర్ 6కి సినిమాను వాయిదా వేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఈ సినిమాను ఒక రోజు ముందుకు జరిపి అంటే డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తామని చెప్పడంతో ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఇంతటి భారీ హైప్ ఉన్న పుష్ప 2కు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

mythri movie makers reacts on pushpa 2 the rule postponement rumors

థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ. 640 కోట్లు, డిజిటల్ రైట్స్‌ రూ. 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ముదులిపాడు. అలాగే గతంలో ఏ భారతీయ సినిమాకు లేని విధంగా పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11500 థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. పుష్ప పార్ట్ 1లో సమంతతో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్.. పార్ట్ 2లో శ్రీలీలకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. కిస్సిక్ అంటూ ఆ మసాలా సాంగ్ అప్పుడే ట్రెండ్ అవుతోంది.

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది పుష్ప యూనిట్. దీనిలో భాగంగా నవంబర్ 17న బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్ స్టేడియంలో ట్రైలర్ లాంచ్ నిర్వహించారు. విడుదలైన 24 గంటల్లోనే ఈ ట్రైలర్ .. గుంటూరు కారం, సలార్ రికార్డులను తిరగరాసింది. ఇంతటి భారీ హైప్ ఉన్న పుష్ప 2ని ఎప్పుడెప్పుడు థియేటర్‌లలో చూద్దామా అని బన్నీ ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

mythri movie makers reacts on pushpa 2 the rule postponement rumors

ఇలాంటి దశలో పుష్ప 2 వాయిదా పడినట్లుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. సినిమాకు సంబంధించి కొన్ని సీన్ల చిత్రీకరణ జరగాల్సి ఉందని, క్లైమాక్స్‌ విషయంలో క్లారిటీ రాకపోవడంతో చిత్ర యూనిట్ డైలమాలో ఉన్నట్లుగా వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఘాటుగా స్పందించింది. పుష్ప 2 విడుదల అనుకున్న సమయానికే థియేటర్‌లో దిగుతుందని.. అమెరికాలో డిసెంబర్ 4న ప్రీమియర్స్‌తో సందడి మొదలవుతుందని క్లారిటీ ఇచ్చింది. అయితే పుష్ప 2పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న వారెవరో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: pushpa 2 the rule allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X