మైత్రి మూవీ మేకర్స్ నుంచి రాబోతున్న బిగ్ బడ్జెట్ సినిమాలు.. పవర్ఫుల్ లైనప్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే అతిపెద్ద భారీ ప్రాజెక్టు సినిమాలతో నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపును అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సంస్థ నిర్మాతలు మిగతా భాషల్లో కూడా వారి స్థాయిని పెంచుకునే విధంగా సినిమాలను లైన్లోకి తీసుకురాబోతున్నారు. అగ్ర హీరోలను ప్రముఖ దర్శకులను ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేసి నమ్మకంతో పవర్ఫుల్ లైనప్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక్కో ప్రాజెక్ట్ వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరపైకి రాబోతోంది. ఇక అందులోని టాప్ సినిమాల వివరాల్లోకి వెళితే..

పుష్ప 2.. మరో బిగ్ మూవీగా..
పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ మొదటి సక్సెస్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఆ సినిమాకు సెకండ్ పార్ట్ ని కూడా అంతకుమించి అనేలా తీరపైకి తీసుకురాబోతోంది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఆ సినిమా బడ్జెట్బ్250 కోట్లకు పైగానే ఉండబోతోంది.

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో
అంతేకాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు కలయికల్లో కూడా మరో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా 270 కోట్లు దాటనుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా రానుందని ఇదివరకే ఒక టాక్ వచ్చింది. దర్శకుడు దాదాపు స్క్రిప్ట్ మొత్తం కూడా ఫినిష్ చేసుకున్నాడు. ఈ ఏడాది సమ్మర్ అనంతరం ఆ సినిమా షూట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో హై వోల్టేజ్ యాక్షన్
ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రానుంది. ఆ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ కోసం కూడా 200 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమాతో రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆ సినిమా రానుంది. ఇక మైత్రితో వచ్చే ఏడాది ఎన్టీఆర్ 31వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ మూవీస్
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా థెరి సినిమాకు రీమేక్. వీటితో పాటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కూడా ప్రస్తుతం లైన్లో ఉంది. ఈ రెండు సినిమాల కోసం కూడా దాదాపు 250 కోట్లు ఖర్చవుతున్నాయి. ఖుషి షూటింగ్ కూడా సగం పూర్తయింది. సమంత కథానాయకగా నటిస్తున్న సినిమాకు శివ నిర్మాణ దర్శకుడు.

వేల కోట్ల పెట్టుబడులు
ఇక ప్రభాస్ హృతిక్ రోషన్ తో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమా బడ్జెట్ కూడా హై రేంజ్ లోనే ఉండబోతోంది. ఇటీవల నిర్మాతలు ప్రత్యేకంగా దర్శకుడిని కూడా కలిశారు. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ అయితే రాబోయే రోజుల్లో పాన్ ఇండియా సినిమాల కోసం మొత్తంగా 1200 కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతోంది. మరి ఆ సినిమాలు వారికి ఎలాంటి లాభాలను అందిస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











