ఒకేసారి 10 సినిమాలను లైన్ లో పెట్టిన తెలుగు ప్రొడక్షన్ హౌజ్

మైత్రి మూవీ మేకర్స్ అంటే ఇప్పుడు తెలుగులో అందరికంటే ఎక్కువ సినిమాలను నిర్మిస్తోంది. మొదట యూఎస్ లో తెలుగు సినిమాలను రిలీజ్ చేసి ఎన్నో ప్రాఫిట్స్ అందుకున్న ఈ ప్రొడక్షన్ నిర్మాతలు మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక అక్కడి నుంచి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా మంచి సినిమాలను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ లో 10 సినిమాలు రూపొందుతున్నాయి. అందులో కోన్ని విడుదలకు కూడా సిద్ధమయ్యాయి. మెయిన్ గా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప పాన్ ఇండియా అనే సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ తో మరోసారి సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. నాని అంటే సుందరిని కూడా రెడీ అవుతోంది. ఇక ఉప్పెన సినిమాను సుకుమార్ ప్రొడక్షన్ లో నిర్మించగా ఆ సినిమా వచ్చే నెలలో రానుంది.

Mythri movie makers upcoming projects

ఇక పవన్ కళ్యాణ్, హరీష్ కంకర్ కాంబోతో పాటు బాలకృష్ణ - గోపిచంద్ మలినేని, కొరటాల శివ - రామ్ చరణ్, ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, చిరంజీవి - బాబీ, విజయ్ దేవరకొండ - శివ నిర్వణ వంటి కాంబినేషన్స్ లలో సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అంటే వీరి పెట్టుబడులు కూడా ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చూస్తుంటే రానున్న రోజుల్లో టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌజ్ లలో మైత్రి మూవీ మేకర్స్ కూడా కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X