సుకుమార్ బర్త్ డే.. బన్నీ ఫ్యాన్స్‌కు గిఫ్ట్
నేడు సుకుమార్ పుట్టిన రోజు సందర్బంగా.. చిత్ర ప్రముఖుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్, అల్లు అర్జున్, రత్నవేలు లాంటి స్నేహితులు ప్రత్యేకమైన విషెస్ చెప్పారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే సుకుమార్ పుణ్యమా అంటూ బన్నీ ఫ్యాన్స్‌కు ఓ గిఫ్ట్ వచ్చింది. అదెలా అనుకుంటున్నారా? ఆ కథెంటో ఓ సారి చూద్దాం.
అల్లు అర్జున్ తాజా చిత్రం అల వైకుంఠపురంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే ఈ సినిమా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అందరూ ఈ ఆనందంలో ఉండగా.. బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా వచ్చేసింది. సుకుమార్, మైత్రి మూవీస్‌లతో బన్నీ చేస్తోన్న తదుపరి చిత్రం గురించి ఓ అప్‌డేట్ వచ్చేసింది.

సుకుమార్ బర్త్ డే సందర్భంగా మైత్రి వారు మేకింగ్ వీడియో విడుదల చేసింది. కేరళ అడవుల్లో ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోను బట్టి అది నిజమనే తెలుస్తోంది. ఆ వీడియోను చూస్తేనే సినిమా ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ఆర్య మరియు ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాలు రాగా.. ఈ మూడో చిత్రంపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











