twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ పోరాటంలో అదే మన ఆయుధం.. ఇంకేమీ చేయలేం!! ఎన్టీఆర్ రియాక్షన్ చూస్తే..

    |

    దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ వైరస్‌ని కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రజల్లో మరింత అవగాహన తీసుకొస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ ఆసక్తికరంగా, అందరికీ అర్ధమయ్యే విధంగా స్పందించారు. వివరాల్లోకి పోతే..

    కోరలు చాస్తున్న కరోనా.. ప్రభుత్వ చర్యలు

    కోరలు చాస్తున్న కరోనా.. ప్రభుత్వ చర్యలు


    చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాలో వీర విహారం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే దీనికి భయపడాల్సిన పనిలేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని అంతమొందించవచ్చని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు వైద్య శాఖ సూచనల ప్రకారం ప్రభుత్వ చర్యలు కట్టుదిట్టం చేసింది.

    అన్నీ బంద్.. జనతా కర్ఫ్యూ

    అన్నీ బంద్.. జనతా కర్ఫ్యూ

    ఇప్పటికే సినిమా థియేటర్స్, హోటల్స్, బార్స్, పార్క్స్ లాంటి జనసమూహం నిలిచిఉండే ప్రదేశాలను బంద్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా నివారణలో భాగంగా నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ అనే కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టి అందరూ తూచాతప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ ఆదివారం (మార్చి 22) ప్రజలెవరూ బయటకు రాకుండా ఎవరికి వారు స్వీయ నిర్భందాన్ని విధించుకోవడమే జనతా కర్ఫ్యూ ఉద్దేశ్యం.

    ప్రధాని పిలుపు.. సినీ తారల రియాక్షన్

    ప్రధాని పిలుపు.. సినీ తారల రియాక్షన్

    కరోనా వ్యాప్తి గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ ముందునుంచీ పలు సూచనలు ఇస్తూనే వస్తున్నారు సినీ తారలు. తాజాగా ప్రధాని ప్రకటించిన జనతా కర్ఫ్యూకు కూడా పలువురు సినీ తారలు మద్దతు పలికారు. ఈ లిస్టులో ఇప్పటికే చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ , మహేష్ బాబు, రాజమౌళి లాంటి వాళ్ళు ఇండగా.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా చేరారు.

    ఎన్టీఆర్ సపోర్ట్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    ఎన్టీఆర్ సపోర్ట్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    ''సామాజిక దూరం పాటించడమే కరోనాను అరికట్టేందుకు బలమైన ఆయుధం. అందరం ఈ ఆదివారం (మార్చి 22) జనతా కర్ఫ్యులో పాల్గొని ఐక్యంగా కరోనా వైరస్‌ను తరిమి కొడదాం. ఇంటి దగ్గరే ఉండండి.. మీతో పాటు అందరినీ రక్షించండి. ఇంకేమీ చేయలేం'' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

    Recommended Video

    Trisha Walks Out Of Chiranjeevi’s ‘Acharya’ Movie

    గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌.. RRR


    గతంలో కూడా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న RRR మూవీలో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

    English summary
    N. T. Rama Rao Jr. Support Janta CurFew. Earlier Pawan Kalyan, Chiranjeevi Supported Janta CurFew. they Released A Video Byte About PM Narendra Modi Janta CurFew Concept. He Suggests The People That Follow Modi Janta Cerfew Concept.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X