RRRలో ఎన్టీఆర్ లుక్ లీక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో, పిక్స్
బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ఆ రేంజ్‌లో చర్చ జరుగుతోంది ఒక్క RRR సినిమా గురించే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండటంతో షూటింగ్ దశలోనే భారీ హైప్ నెలకొంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్‌లో నటిస్తున్నాడు.
చాలాకాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ పరంగా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో వారిద్దరి లుక్ ఎలా ఉండబోతోంది? అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది ప్రేక్షకుల్లో. సరిగ్గా ఈ సమయంలో ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటో ఒకటి బయటపడటంతో ఆ పిక్ తెగ వైరల్ అవుతోంది.

ఎయిర్‌పోర్ట్ నుంచి నాయతకు వస్తున్న ఎన్టీఆర్ కెమెరాకు చిక్కారు. గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో ఎన్టీఆర్ కనిపించారు. దీంతో RRRలో ఎన్టీఆర్ లుక్ బయటపడిందని, ఈ లుక్ లోనే RRRలో ఎన్టీఆర్ కనిపించనున్నారని టాక్ మొదలైంది. ఈ పిక్ చూసి.. ఎట్టకేలకు ఈ రకంగానైనా RRRలో ఎన్టీఆర్ లుక్ రివీల్ అయిందని కొండరేంటంటే, ఎన్టీఆర్ లుక్ కేక అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా RRR. డీవీవీ దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తోంది. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











