మెగా, నందమూరి అభిమానులకు కన్నుల పండగ: స్పెషల్ కిక్కిచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్

Recommended Video

Ram Charan & Jr NTR Special Pic With Ajay Devgn | RRR | SS Rajamouli

బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత జక్కన్న చేస్తున్న మరో భారీ మూవీ RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా అడుగుపెట్టారు. అయితే తాజాగా ఆయనతో ఓ ఫోటో దిగిన మెగా, నందమూరివారసులు వారి వారి అభిమానులను కనువిందు చేశారు. వివరాల్లోకి పోతే..

భారీ తారాగణం.. జక్కన్న ప్లాన్

భారీ తారాగణం.. జక్కన్న ప్లాన్


ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని RRR సినిమా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఈ సినిమా కోసం టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ లాంటి భారీ తారాగణానికి తోడు బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి స్టార్ నటీనటులను తీసుకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా పాత్రలు రూపొందించారు.

ఎప్పుడో చెప్పిన రాజమౌళి.. ఇప్పటిదాకా

ఎప్పుడో చెప్పిన రాజమౌళి.. ఇప్పటిదాకా

చాలా రోజుల క్రితమే RRR ప్రాజెక్టు ప్రకటించిన రాజమౌళి గత కొంతకాలంగా శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం మేర షూటింగ్ ఫినిష్ చేసుకున్నట్లు టాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ లకు సంబంధించిన షూటింగ్ చాలావరకు పూర్తయింది. ఇక ఇప్పుడు RRR సెట్స్ పైకి అజయ్ దేవగణ్ కూడా వచ్చేశారు.

అభిమానులకు ఎన్టీఆర్ కిక్

ఈ మేరకు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌కి సంబంధించిన షెడ్యూల్ జనవరి 21 నుంచే ప్రారంభమయింది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌ చేరుకున్న ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఆయనతో కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ అభిమానులకు కిక్కిచ్చారు ఎన్టీఆర్.

ఒకే ఫ్రేమ్‌లో దిగ్గజాలు.. అభిమానులకు కన్నుల పండగ

రామ్ చరణ్, రాజమౌళి, అజయ్ దేవగణ్ లతో దిగిన పిక్ షేర్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. "మా RRR లోకంలోకి వచ్చేసిన అజయ్ దేవగణ్ సార్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగా, నందమూరి అభిమానులకు ఈ పిక్ కన్నుల పండగగా మారింది.

రామ్ చరణ్‌, ఎన్టీఆర్ జోడీ.. ఇద్దరు హీరోయిన్లు

రామ్ చరణ్‌, ఎన్టీఆర్ జోడీ.. ఇద్దరు హీరోయిన్లు

ఇక చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. చారిత్రాక నేపధ్యమున్న ఈ చిత్రానికి రామ రౌద్ర రుషితం అనే టైటిల్ పరిశీలనలో పెట్టింది చిత్రయూనిట్. జులై 30 అనుకున్నా చిత్ర విడుదల తేదీపై సందేహాలు కొనసాగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X