twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRRయే దోస్తీ.. ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ బాండ్.. రామ్ చరణ్ గురించి ఎన్టీఆర్

    |

    ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాము. ప్రియనేస్తాలంతా వారి వారి స్నేహితులతో జాలీగా గడుపుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక గిఫ్ట్‌లు, ఫ్రెండ్‌షిప్ బాండ్‌ల కైతే కొదవే ఉండదు. అయితే ఈ సారి ఫ్రెండ్‌షిప్ డేని RRR ఏ దోస్త్ హాష్ ట్యాగ్‌తో ప్రత్యేకంగా జరుపుకోండి అంటూ ట్వీట్ చేసింది RRR యూనిట్. ప్రస్తుతం ఈ హాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

     RRRయే దోస్తీ పోస్టర్

    RRRయే దోస్తీ పోస్టర్

    ఈ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలను 'RRR యే దోస్త్' ట్యాగ్ తో చెప్పండి అంటూ పోస్టర్ రిలీజ్ చేసిన RRR యూనిట్.. ఈ పోస్టర్ ద్వారా రామ రాజు, భీం స్నేహం గురించి చెప్పింది. అంతేకాదు మీ లైఫ్ లో కూడా ఇలాగే ఊహించని రీతిలో స్నేహితులుగా మారి మీ లైఫ్‌లో కీలకమైన వ్యక్తులకు ఈ RRRయే దోస్తీ హాష్ ట్యాగ్ ద్వారా విష్ చేయండి అని పేర్కొంది.

    ఎన్టీఆర్, రాజమౌళి సహా ఇతర యూనిట్ అంతా

    ఎన్టీఆర్, రాజమౌళి సహా ఇతర యూనిట్ అంతా

    ఈ మేరకు ఎన్టీఆర్, రాజమౌళి సహా ఇతర యూనిట్ సభ్యులంతా RRR యే దోస్త్ హాష్ ట్యాగ్‌తో తమ తమ ప్రియ స్నేహితులకు విషెస్ చెబుతున్నారు. నిర్మాత సాయి కొర్రపాటికి రాజమౌళి శుభాకాంక్షలు తెలపగా, ఎన్టీఆర్ రామ చరణ్‌కి విష్ చేశారు.

    నా జీవితంలో ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది ఆయనే.. రాజమౌళి

    ''గమ్యం చేరేందుకు గాను విధి అనుకూలంగా ఉంటే, జీవితంలో సాయి లాంటి వ్యక్తి తోడవుతాడు. నమ్మకానికి చిహ్నమైన ఆ వ్యక్తి నా జీవితంలో నాకు ఎక్కువ మద్దతిచ్చిన వ్యక్తి. అతను నా భీమ్ నేను అతని ఆనందం తప్ప మరేమీ కోరుకోను'' అంటూ RRRయే దోస్తీ హాష్ ట్యాగ్ ద్వారా రాజమౌళి ట్వీట్ పెట్టారు.

    రామ్ చరణ్ గురించి ఎన్టీఆర్

    ''ఫ్రెండ్ షిప్ చేసే ముందే మెల్లగా ఆలోచించి దిగండి. ఒక్కసారి ఫ్రెండ్ షిప్ మొదలయ్యాక ఆ స్నేహాన్ని అలాగే స్థిరంగా కంటిన్యూ చేయండి'' అని సోక్రటీస్ చెప్పిన వాక్యాలను ట్వీట్ చేస్తూ రామ చరణ్‌తో నా స్నేహ బంధం గురించి ఇంతకుమించి వర్ణించలేను అని పేర్కొంటూ RRRయే దోస్తీ హాష్ ట్యాగ్ ద్వారా ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఈ ట్వీట్ చూసి నందమూరి, మెగా అభిమానులు మురిసి పోతున్నారు.

     RRR మూవీ

    RRR మూవీ

    రాజమౌళి దర్శకత్వంలో RRR అనే వర్కింట్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Rajamouli Now directed RRR movie. It will going to realese as fourth movie of ntr, Rajamouli successfull combo. Now this movie shooting is successfully going on with Ram Charan, N. T. Rama Rao Jr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X