ప్రపంచ యాత్రికుడిపై తెలంగాణ పోలీసులు కేసు .. అన్వేష్‌‌పై రేవంత్ రెడ్డి సర్కార్ కన్నెర్ర

బెట్టింగ్ యాప్ స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. నటీనటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో పలువురు యాంకర్లు కూడా ఉన్నారు. వారిపై ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదవ్వగా.. విచారణకు సైతం వారు హాజరయ్యారు. విషయం కోర్టుల వరకు వెళ్లగా మరికొందరు పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ ఇష్యూలో పలువురు సెలబ్రెటీల పేర్లు బయటపెట్టిన యూట్యూబర్ అన్వేష్‌ చిక్కుల్లో పడ్డాడు. ఈ వివరాల్లోకి వెళితే..

naa anveshana anvesh in legal trouble telangana police filed case aganist youtube

నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. దేశ , విదేశాల్లో తిరుగుతూ అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు, వింతలు, విడ్డూరాలను పంచుకుంటున్నాడు. ఈ వివరాలు తను ప్రజెంట్ చేసే తీరు జనానికి బాగా నచ్చడంతో ఇతని యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ఖాతాకు కోట్లలో ఫాలోవర్స్ వచ్చారు. ఫాలోయింగ్ భారీగా పెరగడంతో అతిని వీడియోలకు వ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తూ.. నెలకు కోటి వరకు సంపాదించే రేంజ్‌కు చేరుకున్నాడు.

సెలబ్రెటీలను టార్గెట్ చేస్తున్న అన్వేష్

అయితే అన్వేష్ రూటు మార్చాడు .. ప్రపంచంలో జరిగే అన్ని రకాల అంశాలపై స్పందిస్తూ వీడియోలు తీస్తున్నాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై ఫోకస్ పెట్టాడు. బెట్టింగ్ యాప్‌ల కారణంగా అమాయకులు బలైపోతున్నారని చెబుతూ .. చట్ట విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, యూట్యూబర్లను టార్గెట్ చేస్తూ రోజుకొకరి బండారం గురించి బయటపెడుతున్నాడు. బెట్టింగ్ యాప్‌లపై తాను చేస్తున్న వీడియోలకు వచ్చిన డబ్బుని , బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయారో వారికే ఇచ్చేస్తానని ప్రకటించాడు.

తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కెలికిన అన్వేష్

ఇటీవల కొందరు సెలబ్రెటీలపై వీడియో చేసి ఏకంగా ఉగ్రవాదులతో లింక్ పెట్టాడు. వాళ్లని జైళ్లో వేసినట్లుగా థంబ్ పెట్టి చంపేయాలి, కాల్చేయాలంటూ అవాకులు చవాకులు పేలడంతో వారు మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం పెద్దలనే అన్వేష్ కెలికాడు. తెలంగాణ డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో కొందరు అధికారులు రూ.300 కోట్లు దోచేశారంటూ ఆరోపించాడు. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసిన అభియోగాలపై అన్వేష్‌పై కేసు నమోదు చేసింది. వీడియోను సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.

అన్వేష్‌పై తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్

అన్వేష్ తీరు దేశానికి వ్యతిరేకంగా ఉండటంతో పాటు సదరు అధికారుల పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమపై అన్వేష్ చేసిన ఆరోపణలకు కొందరు సెలబ్రెటీలు కౌంటరిచ్చారు. అయితే ఈసారి నేరుగా ప్రభుత్వం రంగంలోకి దిగడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఎఫ్ఐఆర్‌పై అన్వేష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X