Naagin పీకల్లోతు విషాదంలో నాగిని ఫేమ్ యాక్టర్.. కళ్ల ముందే ఘాతుకం.. ఇద్దరి కాల్చివేసి దారుణ హత్య!
టెలివిజన్ నటి, నాగిన్ ఫేమ్ మధురా నాయక్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన సోదరి, బావ కుటంబాన్ని ఇజ్రాయెల్‌లో హమస్ దారుణంగా కాల్చి చంపారు. ఇజ్రాయెల్, పాలాస్తీనా మధ్య జరుగుతున్న అంతర్గత యుద్ధంలో వీరిని హమస్ వర్గం దారుణంగా హత్య చేసింది. ఈ విషయాన్ని మధురా నాయక్ వెల్లడించారు. తన సోదరి కుటుంబం దారుణ హత్యకు గురి కావడంపై భావోద్వేగంతో కూడిన లేఖను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ..
నా సోదరి, బావను దారుణంగా హత్య చేశారు. పట్టపగలే తమ పిల్లలు చూస్తుండగానే.. పాశవికంగా చంపేశారు. మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా పాలస్తీనా ఉగ్రవాదులు క్రూరంగా చంపేస్తున్నారు. ఇది అత్యంత హేయమైన చర్య అంటూ మధురా నాయక్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

మధురా నాయక్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో మృతుల ఫోటోలు, వారి పిల్లల ఫోటోలను పోస్టు చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఫోటోల కింద మెసేజ్ పెడుతూ.. నా సోదరి, ఆమె భర్తను వారి పిల్లల ముందే క్రూరమైన పద్దతిలో పాలస్తీనా టెర్రిరిస్టులు చంపేశారు. ఉగ్రవాదుల దాడుల్లో నాకు ఇష్టమైన వారిని కోల్పోవడం చాలా బాధాకరం అని పోస్టులో పేర్కొన్నారు.
తన సోదరి మరణాన్ని తలుచుకొని తీవ్రంగా మనో వేదనకు మధురా నాయక్ గురయ్యారు. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన తన కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి చేకూరాలి. వారి పిల్లలకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలి. ఇజ్రాయెల్‌లో కష్టాల్లో ఉన్న భారతీయులందరికీ అండగా నిలువాల్సిన సమయం ఉంది. ఇజ్రాయెల్‌లో సాగుతున్న మారణహోమం, దారుణకాండను అందరూ ఖండించాలి అని ఆమె పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











