SSMB28: మహేశ్ బాబు మూవీలో కుర్ర హీరోయిన్.. ఆ సెంటిమెంట్ వల్లే తీసుకున్నారా!

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ మధ్య కాలంలోనే 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ హీరో.. హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రాన్ని మొదలు పెట్టిన ఈ హ్యాండ్సమ్ హీరో.. అది షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళితో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. ఇది మొదలెట్టక ముందే మరో చిత్రానికి సిగ్నల్ ఇచ్చాడు.

ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తోన్నాడు మహేశ్ బాబు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనికి ఇంకా చాలా సమయం పట్టేటట్లు ఉంది. అయినప్పటికీ కొద్ది రోజుల క్రితమే ఈ స్టార్ హీరో.. టాలీవుడ్ బడా డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. ఊహించని విధంగా సెట్ అయిన ఈ కాంబోపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఇది ప్రకటించినప్పటి నుంచే ఎన్నో రకాల వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ న్యూస్ బయటకొచ్చింది.

Nabha Natesh Fix for Mahesh Babu Movie

టాలీవుడ్‌లోని దర్శకులు అందరిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతూ ఉంటాడు. కెరీర్ ఆరంభం నుంచీ తన చిత్రాలకు సంబంధించిన టైటిళ్లు, అందులో నటించే నటీనటులు, టెక్నీషియన్లు, షూటింగ్ స్పాట్లు ఇలా ఎన్నో విషయాల్లో ఆయన ఒక పంథాలో వెళ్తుంటాడు. ఇందులో భాగంగానే త్వరలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోయే చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డేతో పాటుగా సెకెండ్ హీరోయిన్‌గా కూడా పెట్టుకోవాలని భావిస్తున్నట్లు ఈ మధ్యనే ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో ఓ రేంజ్‌లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రాబోతున్న సినిమాలో సెకెండ్ హీరోయిన్‌గా ఎవరిని తీసుకోబోతున్నారని రెండు మూడు రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్‌ను సెలెక్ట్ చేసేశారట. తాజా సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌ను తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో తనదైన శైలి నటనతో పాటు అందచందాలతో ఆకట్టుకుంటోన్న ఈ బ్యూటీ ఇప్పుడు భారీ చిత్రంలో ఛాన్స్ పట్టేసిందని ప్రచారం జరుగుతోంది.

Nabha Natesh Fix for Mahesh Babu Movie

'అతడు', 'ఖలేజా' తర్వాత వీళ్ల కాంబోలో రాబోయే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతుందట. ఇందులో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. అలాగే, అతడి లుక్‌ కూడా సరికొత్తగా ఉండబోతుందట. ఇందులో సూపర్ స్టార్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X