యువ హీరో బాలీవుడ్ రీమేక్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ!
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ ఊర మాస్ అమ్మాయిగా హడావుడి చేసిన నభా నటేష్ ఆ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా తర్వాత అమ్మడికి ఊహించని విదంగా డిస్కో రాజా సినిమాతో కాస్త డిజాస్టర్ దెబ్బ ఎదురైంది.
ఆ సినిమా తరువాత అమ్మడికి చాలా వరకు ఆఫర్స్ తగ్గాయి. చర్చలలో ఉన్న ప్రాజెక్టులు కూడా డిస్కో రాజా డిజాస్టర్ కారణంగా చివరి క్షణంలో దూరమయ్యాయి. అందుకే నెక్స్ట్ మంచి కథలను ఎంచుకోవాలని అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో సిద్ధంగా ఉన్న నభా బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమా కూడా చేయబోతోంది.

ఇక త్వరలో నితిన్ చేయబోయే బాలీవుడ్ అందాదున్ రీమేక్ లో కూడా ఈ బ్యూటీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఆ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తేవడానికి నితిన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక హీరోయిన్స్ విషయంలో ఇప్పటికే చాలా మందితో చర్చలు జరిపారు. ఫైనల్ గా నితిన్ ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.


Click it and Unblock the Notifications











