twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇస్మార్ట్ పిల్ల లగ్జరీ కారు.. స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో ఏకంగా!

    |

    ఇటీవలే విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్న నభా నటేష్ లగ్జరీ కారును సొంతం చేసుకుంది. ఈ మేరకు సదరు కారు పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది నభా. ఇస్మార్ట్ విజయాన్ని ఈ రకంగా ఎంజాయ్ చేస్తూ సూపర్ జోష్ లో కొత్త సినిమాలకు కమిట్ అవుతోంది నభా నటేష్.

    రెడ్ కలర్ మెర్సిడిస్ బెంజ్ కారును కొనుగోలు చేసిన నభా నటేష్.. కారు ముందు నిలబడి సెక్సీగా ఫోజులిచ్చింది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కిక్ అమ్మడి దశను మార్చేసింది. పూరీ జగన్నాథ్ సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు హీరోయిన్ల కెరీర్‌ దూసుకుపోతుందని టాలీవుడ్‌లో టాక్ ఉన్న సంగతి తెలిసిందే. అది అక్షరాలా నిజమని నిరూపించింది ఇస్మార్ట్ పిల్ల నభా నటేష్.

    Nabha Natesh Purchased a Luxury Car

    'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత వరుస సినిమాలతో బిజీ అయింది. బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నభా కెరీర్ కి బాగా ప్లస్ అయింది. మాస్ క్యారెక్టర్ తో పాటు హాట్ అందాలతో మెస్మరైజ్ చేస్తూ సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఇస్మార్ట్ సుందరి.

    ఇక ప్రస్తుతం రవితేజ సరసన 'డిస్కో రాజా' సినిమాలో నటిస్తోంది నభా నటేష్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో నభా చేస్తున్న క్యారెక్టర్ ఆమె పాపులారిటీని రెట్టింపు చేయనుందని టాక్.

    English summary
    Director puri jagannadh's latest movie ismart shankar. This movie produced by puri jagannadh and Charmy Kaur. Hero ram's hi voltege action seens saw in this movie. Now this movie heroine Nabha Natesh purchased a new Benj Car.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X