రవితేజను పట్టేసిన నభా నటేష్.. తండ్రి కొడుకులుగా మాస్ మహారాజ్
నన్ను దోచుకుందువటే చిత్రంతో ప్రేక్షకుల మనసులను దోచుకొన్న అందాల భామ నభా నటేష్ రెండో ఛాన్స్ కొట్టేసింది. సుధీర్‌బాబు నటించి, నిర్మించిన నన్ను దోచుకుందువటే చిత్రంలో నభా నటేష్ అందంతోపాటు అభినయంతో ఆకట్టుకొన్నది. తొలి చిత్రమైనా తొణుకు బెణుకు లేకుండా ఈ కన్నడ భామ నటించి సినీ విమర్శకులను మెప్పించింది.

తాజా సమాచారం ప్రకారం.. ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజతో రూపొందుతున్న చిత్రానికి నభా నటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రంలో మాస్ మహారాజా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి కోడుకులుగా రవితేజ నటించబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన పక్కన ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసినట్టు తెలిసింది. అందులో నభా నటేష్ ఒకరు కావడం గమనార్హం.
ఇక ఈ కన్నడభామ నటించిన అదుగో చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఇంతకు ముందే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ గ్రాఫిక్స్ వర్క్ మూలంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. దాంతో తెలుగులో తన రెండో సినిమా నన్ను దోచుకుందువటే ముందుగా విడుదలైంది.
ప్రస్తుతం రవితేజ్ అమర్ అక్బర్ ఆంథోని అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రంలో సునీల్, ఇలియానా, తరుణ్ అరోరా, రాజ్‌వీర్ సింగ్, అభిమన్యు సింగ్ తదితరులు నటిస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దసరాకు రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











