twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nag Ashwin: సినిమా తీయడమంటే ప్రాణం పోసినట్టు.. చెడ్డి గ్యాంగ్ పై నాగ్ అశ్విన్

    |

    చెడ్డి గ్యాంగ్ ముఠా దేశంలో ఎలా హల్ చల్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇదే చెడ్డి గ్యాంగ్ టైటిల్ తో కొత్త సినిమా వస్తోంది అయితే ఇది పూర్తి క్రైమ్ మూవీ కాదు. దొంగతనాల నేపథ్యంతోనే కామెడీ తరహాలో తెరకెక్కించిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. అబుజా ఎంటర్టైన్ మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ కల్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గాయత్రి పటేల్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ముఖ్య అతిథిగా నాగ్ అశ్విన్..

    ముఖ్య అతిథిగా నాగ్ అశ్విన్..

    వెంకట్ కల్యాణ్ హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించిన చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా. అబుజా ఎంటర్టైన్ మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా వ్యవహరించారు. గాయత్రి పటేల్ హీరోయిన్ గా అలరించేందుకు సిద్ధమైన ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇవాళ అంటే శనివారం ఈ సినిమా టీజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కి టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరై మూవీ టీజర్ ను విడుదల చేశారు.

    చిన్న పెద్ద అని తేడా ఉండదు..

    చిన్న పెద్ద అని తేడా ఉండదు..

    టీజర్ అనంతరం నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. "మా కుటుంబానికి ఎంతో సన్నిహితులైన నిర్మాత క్రాంతి కిరణ్ గారు యంగ్ టీమ్ తెరెకెక్కించిన చెడ్డి గ్యాంగ్ తమాషా టీజర్ చాలా బాగుంది. ఒక సినిమా తీసేందుకు చిన్న సినిమా అని పెద్ద సినిమా అని తేడా ఉండదు. కంటెంట్ ఉంటే ప్రతి సినిమాను ఆదరిస్తారు. క్రాంతి కిరణ్ గారు చెప్పినట్లు ఒక సినిమా పూర్తి చేసి విడుదల చేయడం అంటే ప్రాణం పోసినట్టు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే యంగ్ టీమ్ తో మేము తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా లాగే ఈ చెడ్డి గ్యాంగ్ తమాషా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్" అని తెలిపారు.

    చోరీలకు పాల్పడే ఓ యువకుని జీవితం..

    చోరీలకు పాల్పడే ఓ యువకుని జీవితం..

    అనంతరం నాగ్ అశ్విన్ తల్లి డాక్టర్ జయంతి రెడ్డి మాట్లాడుతూ.. "చెడ్డి గ్యాంగ్ తమాషా టీజర్ చాలా బాగుంది. యువకులతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులందనీ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్" అని చెప్పారు. ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ తోపాటు ఆయన తల్లి డాక్టర్ జయంతి రెడ్డి, డాక్టర్ ఉషా, ఇన్ సెక్యూర్ డైరెక్టర్ లక్కీ, నటుడు లోహిత్ కుమార్, కోయ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కాగా నలుగురు కుర్రాళ్లతో కలిసి హైదరాబాద్ సిటీలో దొంగతనాలకు పాల్పడే ఓ యువకుని జీవితం ఓ అమ్మాయి కారణంగా ఎలా మారిందనే కథాంశంతో చెడ్డి గ్యాంగ్ తమాషా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

    English summary
    Description:Prabhas Project K Director Nag Ashwin Comments On A Movie in Venkat Kalyan Cheddi Gang Tamasha Teaser Release Event
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X