7 రోజులు డిప్రెషన్ లో నాగ్ అశ్విన్.. ఆ సినిమాతో ‘కల్కి’ డైరెక్టర్ కు దెబ్బ

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో ఇండియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందు నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించిన కీర్తి సురేష్ కు ఏకంగా జాతీయ అవార్డు దక్కిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సైన్స్ యాక్సన్, మైథాలజీ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ చిత్రంతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1100 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్గా వసూల్ చేసింది. అంతే కాకుండా పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. నాగ్ అశ్విన్ నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు వేచి ఉన్నారు. కానీ ఈ క్రమంలో నాగ్ అశ్విన్ గురించి ఓ ఆసక్తికరమైన విషమం చెప్పారు. దాంతో ఆడియెన్స్ అంతా షాక్ అవుతున్నారు.

Nag Ashwin Depressed for 7 Days

హాలీవుడ్ కు చెందిన ఇన్సెప్షన్ అనే చిత్రంతో నాగ్ అశ్విన్ ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. 2008లోనే తనకు ఆ ఐడియా వచ్చిందని చెప్పారు. ఆ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాగ్ అశ్విన్ షాక్ అయ్యారంట. ఆ సినిమాకు సంబంధించినట్టుగానే తన ఆలోచనలు ఉండేవని, ఒకసారి ఆ మూవీ ట్రైలర్ చూశానని చెప్పారు. ఆ తర్వాత 7 రోజులు డిప్రెషన్ లోకి వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. తనకు కూడా అలాంటి సినిమాను తీయాలనే ఆలోచన ఉండిందంట. కానీ అంతకు ముందే ఇన్సెప్షన్ విడుదల కావడంతో అలా నిరాశకు లోనైనట్టు చెప్పుకొచ్చారు. 2010లో నాగ్ అశ్విన్ చెప్పిన హాలీవుడ్ ఫిల్మ్ 'ఇన్సెప్షన్’ విడుదలైంది.

అయితే నాగ్ అశ్విన్ మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో ఆయన అభిమానులు బాధపడుతున్నారు. ఏం పర్లేదని మీరు తలుచుకుంటే అలాంటి కంటెంట్ ను మించిన చిత్రాలు తీసుకొస్తారనే నమ్మకం మాకు ఉందంటూ ఫ్యాన్స్ భరోసా వ్యక్తం చేశారు. ఇక నాగ్ అశ్విన్ త్వరలో కల్కి 2898 ఏడీకి సంబంధించిన రెండో భాగం కల్కి 2 గురించి ఎప్పుడు అప్డేట్స్ అందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. త్వరలో నాగ్ అశ్విన్ కల్కి 2 చిత్రాన్ని ప్రారంభించ బోతున్నారు అని తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా నాగ్ అశ్విన్ చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఎలాగూ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండటంతో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ అగ్ర హీరో, లోక నాయకుడు కమల్ హాసన్ తో ముందుగానే షూటింగ్ ను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుస గుస లు వినిపిస్తున్నాయి. కల్కి 2తో బాక్సాఫీస్ వద్ద 2000 కోట్లు ఖాయమని అంటున్నారు. మరీ అంచనాలను రీచ్ అవుతారా? అన్నది వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: nag ashwin kalki 2898 ad prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X