ప్రభాస్ ఫ్యాన్స్‌కు హ్యాండిచ్చిన నాగ్ అశ్విన్: ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్
కొంత కాలం క్రితం వరకూ చాలా గ్యాప్ తీసుకుని సినిమాలు చేసి.. ఇటీవల వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి', 'సాహో' వంటి పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటిన అతడు.. ప్రస్తుతం 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరికొన్ని ప్రాజెక్టులను ప్రకటించాడు. అందులో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ప్రాజెక్టు కూడా ఉంది. ఈ సినిమా విషయంలో సదరు దర్శకుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెప్పి షాకిచ్చాడు.
కొద్ది రోజుల క్రితం ట్విట్టర్‌లో యంగ్ రెబెల్ స్టార్ అభిమానులు ఈ మూవీ గురించి చర్చించుకున్నారు. అదే సమయంలో నాగ్ అశ్విన్‌ను కూడా ట్యాగ్ చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన దర్శకుడు 'కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29న ఒకటి.. ఫిబ్రవరి 26న మరొక అప్‌డేట్ రాబోతుంది' అని ఫ్యాన్స్‌కు రిప్లై ఇచ్చాడు. దీంతో వాళ్లు ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంకో పది రోజుల్లో నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీ అప్‌డేట్ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన డైరెక్టర్.. సారీ చెప్పాడు.

ప్రభాస్ ఫ్యాన్ చేసిన ఓ ట్వీట్‌కు 'సారీ.. ఫిబ్రవరి 26న అప్‌డేట్ రావడం లేదు. దీనికి నన్ను క్షమించండి. ఇది సరైన సమయం కాదని అనిపించింది' అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వాళ్లంతా పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.]



Click it and Unblock the Notifications











