కల్కిలో ప్రభాస్ ఎంట్రీపై నాగ్ అశ్విన్ లీక్.. భైరవ లేటుగా.. ఎన్నో నిమిషంలో వస్తాడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఇంకా కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా గురించి అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ పాత్ర ఏమిటి? కమల్ హాసన్ రోల్ ఎమిటి? అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఏమిటి? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే వాటిపై నాగ్ అశ్విన్ తాజాగా లీక్ చేశారు. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడుతూ..

కల్కి 2898 ఏడీ సినిమా అందరి అంచనాలకు, అభిరుచికి తగినట్టే ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే పాట ఓ రేంజ్‌లో ఉంటుంది. మీకు ఆల్ టైమ్ ఫేవరేట్‌గా మారిపోతుందని బలంగా చెప్పగలుగుతున్నాను. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి అని నాగ్ అశ్విన్ ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో తెలిపారు.

Nag Ashwin leaks Prabhas s Bhairava Role entry in Kalki 2898 AD

సాధారణంగా నేను ఏ సినిమా చూసినా చప్పట్లు కొట్టను. కానీ నేను తీసిన కల్కి సినిమాను నేను చూసినప్పుడు ఆ ఉత్సాహం, ఉత్కంఠను ఆపుకోలేక నేను చెప్పట్లు కొట్టాను. ఆ సినిమా అలాంటి అనుభూతిని ప్రేక్షకులకు పంచుతుందని నేను అనుకొంటున్నాను అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఇదిలా ఉండగా, ప్రభాస్ పోషించిన పాత్ర భైరవ ఎప్పుడు వస్తుందనే అంతగా పట్టించుకోవద్దు. సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. వాటిని పరిచయం చేయడం చాలా ఇంపార్టెంట్. అందువల్ల భైరవ పాత్ర కాస్త లేటుగానే వస్తుంది అని నాగ్ అశ్విన్ కీలకమైన విషయాన్ని లీక్ చేశాడు.

Nag Ashwin leaks Prabhas s Bhairava Role entry in Kalki 2898 AD

ఇక కల్కి 2898 ఏడీ సినిమాలో భైరవ పాత్ర సుమారుగా 20వ నిమిషం తర్వాత వస్తుంది. అప్పటి వరకు మిగితా పాత్రల పరిచయం ఉంటుంది. కాబట్టి ప్రభాస్ ఎప్పుడు వస్తాడనే విషయంపై కంగారు పడకూడదని సినిమా గురించిన విషయాలు వెల్లడించారు.

More from Filmibeat

Read more about: nag ashwin prabhas kalki 2898 ad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X