రజినీకి అలా.. చిరుకి ఇలా.. నాగ్ అశ్విన్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్

చాలా కాలం నుంచి టాలీవుడ్ లో మళ్ళీ సరైన సినిమాలు లేక థియేటర్స్ మూగబోయాయి. ఆడియెన్స్ కూడా పెద్దగా థియేటర్స్ లో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరచలేదు. ఇది ఒక్క మన తెలుగులోనే కాదు హిందీ, తమిళ భాషల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ క్రమంలో ఒక భారీ సినిమా వస్తే మళ్ళీ పూర్వ వైభవం మంది భావించారు. కాగా అలా అనుకున్నట్టుగానే చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చిన ఆ భారీ చిత్రమే "కల్కి 2898 ఎడి".

రెబల్ స్టార్ ప్రభాస్ తో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం మన తెలుగు సినిమా నుంచి మరో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా దీనిని తెరకెక్కించారు. తెలుగు సినిమా అంటూ ప్రపంచ వ్యాప్తంగా కూడా గట్టిగా ప్రమోట్ కూడా చేశారు. కాగా ఎప్పుడు నుంచో తెరకెక్కిస్తున్నప్పటికీ దాదాపు సినిమా థియేటర్స్ లోకి రావడానికి నాలుగేళ్లు పట్టింది.

netizens fires on nag ashwin in this matter

కాగా ఎట్టకేలకి థియేటర్స్ లో ఈ సినిమా వచ్చింది. మరి ఇలా వచ్చిన తెలుగు సినిమా అనూహ్య రెస్పాన్స్ ని అందుకుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాకి అన్ని సినీ వర్గాల ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇంకా ఎప్పుడు లేనిది తమిళ సినీ ప్రముఖులు ఈ సినిమా కోసం మాట్లాడ్డం ఒకింత తెలుగు ఆడియెన్స్ కి కూడా ఆశ్చర్యంగానే అనిపించింది.

కాగా తమిళ హీరోలకి తెలుగు ఆడియెన్స్ అంటే బాగా ఇష్టం కానీ తమిళ ఆడియెన్స్ మన తెలుగు సినిమాలు అంటే ఎప్పుడు కాస్త తక్కువగానే చూస్తారు అనేది ఎన్నో సినిమాలు నుంచి ఉంది. అదే తమిళ స్టార్ మన తెలుగు సినిమాని పొగిడారు అని మన తెలుగు ప్రముఖుల్ని పక్కన పెడితే ఎలా? ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. ఎంత కాదు అనుకున్నా ఖచ్చితంగా ప్రాంతీయ భావం అందరిలో ఉంటుంది.

netizens fires on nag ashwin in this matter

అలానే మన తెలుగు నుంచి అనేకమంది బిగ్ స్టార్స్ కల్కి చిత్రాన్ని నాగ్ అశ్విన్ వర్క్ ని కొనియాడారు. ఇంకా అందరి కంటే ముందు దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా కోసం మొదట స్పందించారు. కానీ నిన్న కోలీవుడ్ సీనియర్ స్టార్ రజినీకాంత్ కల్కి పై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా దీనికి వెంటనే నాగ్ అశ్విన్ స్పందించాడు. కానీ చిరు పోస్ట్ కి మాత్రం చాలా లేట్ గా నార్మల్ రిప్లై ఇవ్వడం జరిగింది.

దీనితో నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మన తెలుగు సినిమా అన్నారు టాలీవుడ్ నుంచి చిరు లాంటి స్టార్ పోస్ట్ చేస్తే కనీసం రిప్లై లేదు అదే రజిని పోస్ట్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చేసావ్ అంటూ నాగ్ అశ్విన్ పై తెలుగు యువత ఇప్పుడు మండిపడుతున్నారు. గతంలో "మహానటి" హిట్ అయ్యిన సమయంలో చిరు నాగ్ అశ్విన్ సహా చిత్ర యూనిట్ అందరికి ప్రత్యేకంగా సన్మానం కూడా చేసారని అలాంటిది నాగ్ అశ్విన్ కనీస కృతజ్ఞత చూపించకపోవడం బాధాకరం అని సగటు తెలుగు సినీ ప్రేమికుడు అంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ఇద్దరి విషయంలో నాగి ఇలా చేయడం హాట్ టాపిక్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X