Prabhas: నాగ్ అశ్విన్ సినిమాపై కీలక నిర్ణయం: ఈ ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్లే

వరుస సినిమాలతో ఫుల్ జోష్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమా చేసిన అతడు.. అది ప్రేక్షకుల ముందుకు రాకముందే మరిన్ని చిత్రాలను ప్రకటించాడు. అందులో ఒకటి బాలీవుడ్ స్టైయిట్ ఫిల్మ్ 'ఆదిపురుష్' కాగా, రెండోది 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న 'సలార్'. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటోన్న ప్రభాస్.. వీటి కంటే మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అది ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది.

ప్రభాస్ కొద్ది రోజుల క్రితమే నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ దీన్ని నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో తీస్తున్నట్లు వెల్లడించారు. ఇక, ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల మొదలవలేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య మీడియాతో మాట్లాడిన దర్శకుడు నాగ్ అశ్విన్ దీన్ని అక్టోబర్‌ నుంచి ప్రారంభిస్తామని వెల్లడించాడు. కానీ, ఇప్పుడది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని తెలుస్తోంది.

Nag Ashwin - Prabhas Movie Postpone to Next Year

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రారంభించాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. కరోనా కారణంగా ఇప్పుడు చేయాల్సిన సినిమాల షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో ముందుగా వీటినే పూర్తి చేయాలని అతడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సో.. నాగ్ అశ్విన్ సినిమాను మరికొంత కాలం వెనక్కి జరపాలని చూస్తున్నాడని టాక్. ఇదిలా ఉండగా.. టైం మెషీన్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా చేస్తోంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X