జైలు నుంచి విడుదల కాబోతోన్న జాతి రత్నాలు.. నిర్మాతగా మారిన నాగ్ అశ్విన్
Recommended Video
మహానటి సినిమాతో టాలీవుడ్ దృష్టిని ఆకర్శించిన దర్శకుడు నాగ్ అశ్విన్. మహానటి సావిత్రి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఘన విజయాన్ని నమోదు చేసింది. తెలుగు సినీ చరిత్రలో మైలురాయి పోయేలా నిలిచిపోయేలా రూపొందించిన నాగ్ అశ్విన్.. నిర్మాతగా మారాడు.

ముగ్గురు రైజింగ్ స్టార్స్‌తో...
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో అందర్నీ ఆశ్చర్యపర్చిన నవిన్ పోలిశెట్టి.. మల్లేశం సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి.. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకునే రాహుల్ రామకృష్ణలతో జాతి రత్నాలు అంటూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నాగ్ అశ్విన్.

ఆకట్టుకుంటోన్న మోషన్ పోస్టర్..
దీపావళి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఈ మోషన్ పోస్టర్ మూవీపై అంచనాలు పెంచే విధంగా ఉంది. 420గా నవీన్ పొలిశెట్టి, 210గా ప్రియదర్శి, 840గా రాహుల్ రామకృష్ణ నంబర్లు ఉండటం.. సత్ప్రవర్తన కారణంగా వారు జైళు నుంచి విడుదల కాబోతోన్నారని చూపించడదం అంతా బాగానే ఉంది.
వచ్చే ఏడాది విడుదల...
ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయబోతోన్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి రదన్ సంగీతాన్ని అందించగా.. పిట్టగోడ ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫన్నీయెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్.. వచ్చే ఏడాదిలో రాబోతోందని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











