ప్రభాస్ కి అన్యాయం... స్పందించిన నాగ్ అశ్విన్.. అలా చేయనని హామీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అభిమానులకు ఏడాదికి రెండు చిత్రాలను తమ ముందుకు తీసుకు వస్తానని డార్లింగ్ హామీ ఇచ్చారు. అందుకోసం ప్రభాస్ ఏమాత్రం సమయం వృథా చేయకుండా తన రాబోయే చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను త్వర త్వరగా పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి అరడజన్ కు పైగా చిత్రాలు రావాల్సి ఉన్నాయి. అత్యధిక బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాలకు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. సెన్సేషనల్ డైరెక్టర్స్ తో ప్రభాస్ నటిస్తుండటంతోనూ భారీ హైప్ నెలకొంది.

నెక్స్ట్ ప్రభాస్ నుంచి క్రియేటివ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న 'రాజా సాబ్' ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఎడిటింగ్, సాంగ్ షూటింగ్స్ తో ఇంకాస్త సమయం తీసుకోనుంది. ఈ చిత్రం పైన కూడా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇక ప్రభాస్ చివరిగా ' సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్ ను కూడా దర్శకులు నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Nag Ashwin Promising words about Prabhas Character in Kalki 2898 Ad Sequel Here is Director Latest Update

అయితే, ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రభాస్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉందని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ రెండు చిత్రాల్లో ప్రభాస్ ను చూపించిన విధానం అభిమానుల ఊహకందని స్థాయిలో ఉండటంతో ప్రభాస్ ని ఇంకాసేపు వెండి తెర పై చూడాలని ఆశపడ్డారు. ప్రభాస్ కంటే మిగితా నటీనటులను ఎక్కువ సమయం తెరపై చూపించారు. దాంతో ప్రభాస్ కు అన్యాయం జరిగిందంటూ పలువురు అభిమానులు అభిప్రాయం పడ్డారు. తమకు ఎంతో ఇష్టమైన డార్లింగ్ ను కూడా మిగతా ఆర్టిస్టుల కంటే ఎక్కువ సమయం స్క్రీన్పై చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఈ పెద్ద ప్రాజెక్ట్ లలో నుంచి 'కల్కి 2898 ఏడీ' పార్ట్ 2 కు సంబంధించిన షూటింగ్ను త్వరలో ప్రారంభించడానికి నాగ్ అశ్విన్ సిద్ధమవుతున్నారంట. అయితే, ప్రస్తుతం ప్రభాస్ తను సైన్ చేసిన చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రాలన్నీ పూర్తి కావాలంటే మినిమమ్ 2 సంవత్సరాల సమయం పట్టనుంది. దీంతో నాగ్ అశ్విన్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ తో షూట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే కనీసం కల్కి పార్ట్ 2 లోనైనా ప్రభాస్ ని ఎక్కువ సమయం చూపించాలని కోరుతున్నారు.

Take a Poll

ఇక ఈ కంప్లైంట్ పై నాగ్ అశ్విన్ కూడాతాజాగా స్పందించారు. మొదటి పార్ట్ లో మహాభారతంలోని కీ ఎలిమెంట్స్ ను సెట్ చేసి, క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేసే వరకే సమయం సరిపోయింది అన్నారు. మొదటి పార్ట్ లో అందుకే అశ్వద్ధామ పాత్రను ఎక్కువగా చూపించినట్టు తెలిపారు. ఇక పార్ట్ 2 లో మాత్రం కర్ణ vs అర్జునుడు గా సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. పార్ట్ 2 మొత్తం ప్రభాస్ నే ఎక్కువగా చూపించబోతున్నామని తెలిపారు. ప్రభాస్ అభిమానులకు హై నిచ్చే సీన్లు కూడా ఉంటాయని నాగ అశ్విన్ స్వయంగా తెలిపారు. ఇక కల్కి 2898 ఏడీ గతేడాది రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 1100 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇక పార్ట్ 2తో సెన్సేషన్ వసూళ్లు రాబట్టబోతున్నారని అభిమానులు నమ్ముతున్నారు.

More from Filmibeat

Read more about: nag ashwin prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X