ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన మహానటి డైరెక్టర్.. ఏకంగా రెండు అప్‌డేట్స్ అంటూ!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్న అతడు.. అది పట్టాలపై ఉండగానే మరికొన్ని ప్రాజెక్టులను ప్రకటించాడు. అందులో ముందుగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ... దాని అప్‌డేట్స్ మాత్రం అంతగా రావడం లేదు. ఇలాంటి సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక విషయాన్ని రివీల్ చేశాడు.

నాగ్ అశ్విన్ మూవీనే అన్నింటి కంటే ముందే ప్రకటించాడు ప్రభాస్. కానీ, దీన్నీ అలాగే ఉంచి మిగిలిన సినిమాలను పట్టాలెక్కించేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో యంగ్ రెబెల్ స్టార్ అభిమానులు ఈ మూవీ గురించి చర్చించుకున్నారు. అదే సమయంలో నాగ్ అశ్విన్‌ను కూడా ట్యాగ్ చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన దర్శకుడు 'కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29న ఒకటి.. ఫిబ్రవరి 26న మరొక అప్‌డేట్ రాబోతుంది' అని ఫ్యాన్స్‌కు రిప్లై ఇచ్చాడు. దీంతో వాళ్లు ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆ అప్‌డేట్లు ఏమై ఉంటాయానన్న ఆసక్తి నెలకొంది.

Nag Ashwin Tell Good News to Prabhas Fans

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ చేసే సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా కథ గురించి పలు ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. టైం మెషీన్‌ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే టాక్ వినిపించింది. దీంతో బాలయ్య నటించిన 'ఆదిత్య 369'తో దీన్ని పోల్చేశారు. అలాగే, 'భైరవ ద్వీపం', 'పాతల భైరవి' కథలు కూడా తెరపైకి వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X