ప్రభాస్ కారణంగా మరో మూడేళ్ళ గ్యాప్.. స్టార్ దర్శకుడికి ఎంత కష్టమొచ్చిందో..
ఒక సినిమా పూర్తయితే గాని మరో సినిమా గురించి ఆలోచించని స్టార్ హీరోలు లాక్ డౌన్ లో వరుసగా రెండు మూడు కథలను లైన్ లో పెట్టేసుకున్నారు. 8 నెలల గ్యాప్ ను ఏ మాత్రం సహించని అగ్ర హీరోలు మరో మూడేళ్ళ వరకు ఖాళీగా ఉండకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ కూడా తన కెరీర్ లో మొదటిసారి వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. రేపో మాపో రాధేశ్యామ్ షూటింగ్ కి ఎండ్ కార్డ్ పెట్టబోతున్నాడు.
ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అనంతరం ఆది పురుష్ తో బిజీ కానున్నట్లు ఇటీవల ఇచ్చిన ఒక అప్డేట్ తో క్లారిటీ వచ్చేసింది. రామాయణ కథగా రాబోతున్నా ఈ సినిమాను 2022 దసరాకు రిలీజ్ చేయనున్నట్లు చెప్పేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఆ మధ్య నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ ఆ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడనేది వైరల్ గా మారింది. ఇక దానికంటే ముందు అది పురుష్ ను ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు క్లారిటి వచ్చేసింది.

నాగ్ అశ్విన్.. అమితాబ్, దీపికా పదుకొనె వంటి స్టార్స్ పేర్లను కూడా ఎనౌన్స్ చేయడంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. ఇక 2022లో రావచ్చని కూడా ఓ వర్గం అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ చూస్తుంటే నాగ్ అశ్విన్ సినిమా 2023లో వచ్చే అవకాశం ఉంది. రామాయణ కథ కోసం ఒక స్పెషల్ లుక్ తో రేడి అవ్వాల్సి ఉంటుంది. రాధే శ్యామ్ అయిపోగానే ఏడాది పాటు ఒకేరకమైన ఫిట్నెస్ తో ఉండాలి. ఇక నాగ్ అశ్విన్ లో మరో రకమైన లుక్ తో ఉండాలి కాబట్టి రెండు ఒకేసారి పూర్తి చేసే అవకాశం లేదట. అందుకే నాగ్ అశ్విన్ సినిమా వచ్చేసరికి మరో మూడేళ్ళ సమయం పట్టవచ్చని అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











