Orange Re Release Collections: పవన్ కళ్యాణ్‌కు ఆరెంజ్ కలెక్షన్స్.. నాగబాబు ఎంత ఇచ్చారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. చిరుత సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ఆయనకు ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మార్చి 27న అంటే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాను రీరిలీజ్ చేశారు.

2010 నవంబర్ 26వ తేదీన ఆరెంజ్ సినిమా విడుదల అయింది. అయితే ఈ చిత్రాన్ని బొమ్మిరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. ఒక్కరినే జీవితాంతం ప్రేమించలేం.. మొదట్లో ఉన్న ప్రేమ చివరి వరకూ ఉండదు.. అందుకే కొంచెం ప్రేమతో జీవతాంతం ప్రేమను పంచుదాం అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించింది.

Orange Re Release Collections

ఈ సినిమాలో చెర్రీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కమర్షియల్ గా ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా రామ్ చరణ్ అభిమానులకు మాత్రం ఈ మూవీ ఎంతో స్పెషల్. అందుకే ఆరెంజ్ చిత్రాన్ని రామ్ చరణ్ పుట్టిన రోజును విడుదల చేయాలని అభిమానులు పెద్ద ఎత్తున కోరారు. దీంతో సినిమాను విడుదల చేశారు. మార్చి చివరి వారంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించారు.

అయితే ఈ సినిమాను మరోసారి థియేటర్ లో చూసేందుకు అభిమానులు బాగానే ఇంట్రెస్ట్ చూపించారు. ఈ క్రమంలోనే రూ.1.05 కోట్లు వచ్చాయి. అయితే ఈ సినిమా రీరిలీజ్ చేస్తే వచ్చిన ఈ డబ్బును జనసేనకు మద్దతుగా అందజేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు.. మెగా బ్రదర్, ఆరెంజ్ సినిమా ప్రొడ్యూసర్ నాగబాబు ఈ డబ్బును చెక్కు రూపంలో అందజేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధినేత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అలాగే ఆరెంజ్ సినిమాను రెండోసారి విడుదల చేసి ప్రదర్శించేందుకు కీలక భూమి పోషించిన సాయి రాజేశ్, ధర్మేంద్ర, ఎస్,కే.ఎన్, శివచెర్రీ, శ్రీనాథ్, ఉమా నాగేంద్ర, శ్రీధర్ తదితరులను శ్రీ నాగబాబు ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X