Nagababu Konidela: "ఆపరేషన్ వాలెంటైన్ ఈవెంట్‌లో నేను మాట్లాడింది తప్పే, క్షమించండి"
మెగా హీరో నాగ బాబు కొణిదెల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ అనేక హిట్ సినిమాల్లో నటించిన ఈయన.. తాజాగా రాజకీయాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన తాజాగా వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సెన్సేషనల్ కామెంట్లు చేశారు. తాజాగా ఈయన చేసిన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే అందరికీ సారీ కూడా చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వరుణ్ తేజ్ హీరోగా.. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన కొత్త సినిమానే ఆపరేషన్ వాలెంటైన్. మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దు రినైసన్స్ పిక్చర్స్ పై ఈ సినిమాంచిన ఈ సినిమా మార్చి 1వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మూడు రోజుల క్రితం చాలా గ్రాండ్ గా జరిగింది.

ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు కూడా పాల్గొన్నారు. ఈక్రమంలోనే హీరో నాగ బాబు షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పోలీసుల గురించి మాట్లాడారు. పోలీస్ క్యారెక్టర్ చేసే వాళ్లు 6 అడుగుల మూడు అంగుళాలు ఉంటేనే బాగుంటుందని.. 5 అడుగుల 3 అంగుళాలు ఉండే వాళ్లు చేస్తే నప్పదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే నాగబాబు చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.
చాలా మంది పోలీసు వేషం వేసే వాళ్లు దీనిపై తెగ ఫీల్ అయ్యారు. దీంతో నాగబాబును ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ చెప్పుకొచ్చారు. దీంతో నాగబాబు ఈ విషయంపై స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఓ నోట్ ను విడుదల చేశారు. ఇటీవల జిరగిన వరుమ్ బాబు ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను పోలీస్ క్యారెక్టర్ 6 అడుగులు 3 అంగుళాలు ఉండే వ్యక్తు చేస్తే బాగుంటుంది.. 5 అడుగులు మూడు అంగుళాల వ్యక్తులు చేస్తే నొప్పదు అని మాట్లాడానంటూ వివరించారు.
అయితే ఈ మాటలను తాను వెనక్కి తీసుకుంటున్నానని.. ఎవరైనా ఈ మాటలకి నొచ్చుకుంటే ఐ యామ్ రియల్లీ సారీ అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. అది యాధృశ్చికంగా వచ్చిందే కానీ వాంటెడ్ గా అన్న మాటలు కాదని.. అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ విషయంపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. మీరు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని కొందరు.. హైట్ తక్కువగా ఉంటే కానిస్టేబుల్ జాబ్ కూడా ఇవ్వట్లేదంటూ వివరిస్తున్నారు. మరికొందరేమో.. నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఆ తర్వాత సారీ చెప్పడం ఇదే పని ఈయనకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











