Naga Babu Konidela: చిరు, పవన్‌ల ఫొటో షేర్ చేస్తూ నాగబాబు ఎమోషనల్.. మా మధ్య ఎన్ని విభేదాలు వచ్చినా!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు నవంబర్ ఒకటో తేదీన మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వివాహానికి మెగా కుటుంబ సభ్యులు అంతా హజరయ్యారు. ఒక్క నాగబాబు తల్లి తప్ప అందరూ ఈ వేడుకకు వచ్చారు. ముఖ్యంగా తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ లు కూడా పెళ్లికి వెళ్లారు. ఇటలీలోనే వివాహం జరిగిన అచ్చమైన తెలుగు సంప్రదాయం ప్రకారమే పెళ్లి వేడుక జరిపించారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక్కో కొత్త ఫొటో బయటకు వస్తున్నా కొద్దీ అవన్నీ తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.

తాజాగా నాగబాబు కొణిదెల షేర్ చేసిన మెగా బ్రదర్స్ ఫొటో ఫుల్ వైరల్ గా మారింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా నాగబాబు ఈ ఫొటోతో పాటు రాసుకొచ్చిన ఎమోషనల్ కామెంట్లు కూడా సంచలనంగా మారాయి. వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్లిన చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో పాటు నాగబాబు ఓ ఫొటో దిగాడు. దాన్ని నాగబాబు షేర్ చేస్తూ.. మా మధ్య ఎన్ని విబేధాలు వచ్చినా, వాదనలు వచ్చినా మా బంధం మాత్రం ఎప్పిటికీ ఇలాగే ఉంటుందని తెలిపారుడ. అలాగే మేము చేసిన పనులు, మా జ్ఞాపకాలు మాత్రమే కాదు, మా మధ్య ఏర్పడే విభేదాల కంటే మా అనుబంధం మరింత ముఖ్యమైనదని వివరించాడు.

Naga Babu Konidela Shares Pawan Kalyan And Chiranjeevi Photo And Gets Emotional

తమ బంధం అనేక మంచి పనులు, ప్రేమగల క్షణాలపై ఆధార పడిందని నాగబాబు చెప్పుకొచ్చారు. తమ ముగ్గురు సోదరుల మధ్య ఉన్న ఈ బంధం నిజంగా విలువైనదిగా బలమైనదిగా తాను భావిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా ఈ బంధం ఎప్పటికీ విడదీయలేనిదిగా ఉంటుందని పేర్కొన్నాడు. నాగబాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. మెగా బ్రదర్స్ మధ్య బంధం ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని కామెంట్లు చేస్తున్నారు. మీలాగే మీ పిల్లలు కూడా జీవితాంతం ఇలా చక్కగా కలిసు ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు.

ముఖ్యంగా మెగా అభిమానులు అంతా నాగబాబు చేసిన ఈ పోస్ట్ చూసి ఫుల్ ఎమోషనల్ అవుతున్నారు. అన్నా, తమ్ముళ్ల మధ్య బంధం ఇలాగే ఉండాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అలా ఉంటేనే.. ఎవరి మధ్య బంధం అయినా కలకాలం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మెబా బ్రదర్స్ ఇలా చక్కగా కలిసుంటే వారిని చూసి వారి అభిమానులు కూడా ఇలాగే చేస్తారని కూడా చాలా మంది భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X