మరోసారి తమ్మారెడ్డికి అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన నాగబాబు.. విషాన్ని కక్కడం ఎందుకు అంటూ..
RRR సినిమా ఆస్కార్ అవార్డు కోసం 80 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని అదే బడ్జెట్ వేరే వాళ్ళకు ఇస్తే 8 సినిమాలు తీస్తారని తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు కాంట్రవర్సీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ కామెంట్స్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. సినీ ప్రముఖులు సైతం తమ్మారెడ్డి కామెంట్స్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఆయనకు మరోసారి తమ్మారెడ్డి కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు నాగబాబు వీడియో విడుదల చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ వివరాలలోకి వెళితే..

అందరి కోరికే అదే..
RRR సినిమా నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే గోల్డెన్ గ్లొబ్ అవార్డ్ సొంతం చేసుకున్న ఆ పాట ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ లో కూడా అవార్డును సొంతం చేసుకోవాలి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి.

ఆస్కార్ రాకపోయినా
ఇక నాగబాబు మరోసారి తమ్మారెడ్డి కామెంట్స్ కు సమాధానం ఇస్తూ.. ముందుగా ఆస్కార్ బరిలో మన తెలుగు సినిమా ఉన్నందుకు గర్వపడాలన్న నాగబాబు నాటు నాటు అంటూ ప్రపంచంలో తెలుగోడి పాట వినిపిస్తుందని RRR కు అవార్డ్ వస్తే తెలుగోడు కాలర్ ఎగుర వేస్తాడని అన్నారు. ఒకవేళ ఆస్కార్ రాకపోయినా.. పోటీలో ఉన్నాం అని గర్వంగా చెప్పుకోవచ్చని ఇదిరా మన తెలుగోడి సత్తా, మా భారతీయుడి సత్తా అని జబ్బలు చరుస్తూ గర్వంగా నిలబడాలి అని అన్నారు.

కుళ్లుకుని చచ్చిపోవడం ఎందుకు?
అయితే అలా కాకుండా కుళ్లుకుని చచ్చిపోవడం ఎందుకు? మెచ్చుకోవడం అనే సంస్కారం కొంతమందికి లేకపోవచ్చని అన్నారు. ఇక సినిమాలు మానేసి.. ప్రొడక్షన్ మానేసి రిటైర్ అయిపోయిన బ్యాచ్ మనది అంటూ తమ్మారెడ్డిని ఎద్దేవా చేశారు. మన వల్ల కనీసం కుక్కకి కూడా ఉపయోగం లేదని అన్నారు.

వాటిలో ఎన్ని హిట్లు ఉన్నాయి?
ఊరికే వీడియోలు పెట్టి కథలు చెప్పడం కెమెరా కనిపిస్తే పెద్ద అనలిస్ట్‌లా మాట్లాడితే జనం అభినందిస్తారని అనుకుంటున్నాడని పేర్కొన్నారు. నువ్వు ఎన్ని సినిమాలు తీశావ్? వాటిలో ఎన్ని హిట్లు ఉన్నాయి? మీ సినిమాల్లో నటించిన వాళ్లకి రెమ్యునరేషన్ ఇచ్చావా? అని నాగబాబు ప్రశ్నించారు.

నీ పనికి మాలిన మాటలు
నీ పనికి మాలిన మాటల గురించి మాకు తెలియదా? నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నీకు సంబంధం లేకపోయినా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? మాకు చేతకాదా? అని అనడం ఎందుకు ఈ విషయంలో మాకు ఎందుకు వచ్చిన పెంటలే అని రాజమౌళి, కీరవాణి సైలెంట్‌గా ఉండొచ్చు కానీ మేం చూస్తూ ఊరుకోవాలా? అని నాగబాబు అన్నారు.

విషాన్ని కక్కడం ఎందుకు?
వేరే వాళ్లు అంటే జర్నలిస్టులు లేదా సినిమా క్రిటిక్స్ విమర్శించారంటే అనుకోవచ్చు. అది వాళ్ళ జీవన భృతి కానీ అన్నీ అయిపోయి సైలెంట్ గా ఉన్న నీకేం సంబంధం? ప్రపంచం మెచ్చుతున్న సినిమా మీద నీకు ఎందుకంత కుళ్లు? నచ్చక పోతే సైలెంట్ గా ఉండాలి కానీ విషాన్ని కక్కడం ఎందుకు? మీరు విషం కక్కుతుంటే చేతులు కట్టుకుని కూర్చుంటామా? అంటూ సుదీర్ఘంగా నాగబాబు కౌంటర్ల వర్షం కురిపించారు.


Click it and Unblock the Notifications











