మెగా హీరోకు విచిత్ర పరిస్థితి: రియల్ లైఫ్ మామయ్య... రీల్ లైఫ్ ఫాదర్!
అల్లు శిరీష్ హీరోగా 'ఏబిసిడి' (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఎబిసిడి చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ మూవీలో అల్లు శిరీష్ తండ్రి పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని శిరీష్ వెల్లడిస్తూ 'రియల్ లైఫ్ మామయ్య... రీల్ లైఫ్ తండ్రిగా మారారు. ఈ స్క్రిప్టు విన్నపుడు ఇందులో తండ్రి పాత్రకు ఆయన తప్ప మరెవరూ సూటవ్వరని డిసైడ్ అయ్యాను. నాగబాబాయ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. షూటింగులో ఆయనతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

ఈ చిత్రంలో 'కృష్ణార్జున యుద్ధం' ఫేమ్ రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. మాస్టర్ భరత్ అల్లు శిరీష్ స్నేహితుడిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు.
తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టులో మార్పులు చేశాం. దర్శకుడు సంజీవ్ రెడ్డి మీద పూర్తి నమ్మకం ఉంది అని నిర్మాతలు మధుర శ్రీధర్, యష్ రంగినేని తెలిపారు.


Click it and Unblock the Notifications











