ఇలా చెబితే ప్రజలు వినరు.. వారికి అదే కరెక్ట్.. లాక్ డౌన్‌పై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్
ఓ వైపు కరోనా కోరలు చాచుతోంది.. ఎంత కట్టడి చేద్దామని ప్రయత్నిస్తుంటే అంతగా విస్తరిస్తోంది. చివరకు కరోనా ధాటికి రాష్ట్రాలకు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఎవరి ఇంట్లో వారే ఉంటున్నారు. అయినా సరే కరోనా వ్యాప్తిచెందుతూనే ఉంది. ఇదిలా ఉంటే జనాలు కూడా భయమనేది లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. వీటిపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యాడు.

కరోనాపై వ్యంగ్యాస్త్రాలు..
కరోనా ప్రబలుతున్న నాటి నుంచి నాగబాబు వ్యంగ్యస్త్రాలు సంధిస్తూనే ఉన్నాడు. మానవ తప్పిదం వల్లే కరోనా పుట్టిందని, దేన్ని దేవుడే సృష్టించాడని కొందరు అంటున్నారు.. దేవుడికి కూడా కోపాలుంటాయా? అంటూ ఇలా ఏదో ఒకటి ట్వీట్ చేస్తూనే ఉన్నాడు.

దేవుడ ఏమీ పీకలేడంటూ..
కరోనా వైరస్ నుంచి దేవుడు, స్వామిజీలు ఏమీ పీకలేక.. వైద్యుల వైపు చూస్తున్నారని కామెంట్ చేశాడు. కరోనా నుంచి సైంటిస్ట్‌లు, డాక్టర్లే మనల్నీ కాపాడుతారని వెళ్లి వాళ్ల కాళ్లు మొక్కుదామని ట్వీట్ చేశాడు. ఇలా ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు.
జనతా కర్ఫ్యూకు మద్దతు..
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యావత్ భారతదేశ ప్రజలు స్వచ్ఛందంగా నిన్న ‘జనతా కర్ఫ్యూ' పాటించిన విషయం తెలిసిందే. ఈ జనతా కర్ఫ్యూకు తన మద్దతును తెలిపాడు. అంతేకాకుండా విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశాడు.

మిలటరీని దించాలి..
అయితే లాక్ డౌన్ అయినా సరే బాధ్యతను విస్మరించి కొందరు బయటకు వస్తూనే ఉండటంపై నాగబాబు ఫైర్ అయ్యాడు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఓ విన్నపం కూడా చేశాడు. మన దేశంలోని ఎక్కువ మంది ప్రజలు నిరక్షరాస్యులు, క్రమశిక్షణారాహిత్యం గలవారు, నిర్లక్ష్యం గలవారు వీరందిర్నీ కంట్రోల్ చేయాలంటే మిలటరీ సాయం తీసుకోవాలని కేంద్రానికి సలహా ఇచ్చాడు.
Recommended Video

నివారణ కోసం ఆలోచించండి..
రానున్న ముప్పై రోజుల్లో ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నానని అన్నాడు. మెడిసిన్, వాక్సిన్ గురించి ఆలోచించకండి... నివారణ కోసమే ఆలోచించండని సూచించాడు. అందరూ కూడా స్వీయ నిర్భందాన్ని అనుసరించండని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











