నాగచైతన్య, సమంత మొదలుపెట్టేశారు.. నేటి నుంచి..
నాగచైతన్య, సమంత దంపతులు మరోసారి వెండితెరపైన తుళుక్కుమననున్నారు. చాలా రోజుల తర్వాత వారిద్దరూ కలిసి నటించడం గమనార్హం. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరూ ఓ ప్రేమ కథా చిత్రంలో నటించడానికి ఇంతకు ముందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లో 17వది. ప్రేమ, వివాహ బంధాల నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌కు నాగచైతన్య, సమంత హాజరయ్యారు.

మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా యూరప్ వెకేషన్‌కు వెళ్లి వచ్చిన నాగచైతన్య, సమంత తమ ప్రొఫెషనల్ పనుల్లో బిజీగా మారిపోయారు. నాగచైతన్య నటించిన సవ్యసాచి విడుదలకు సిద్ధంగా కాగా, తమిళంలో సమంత నటించిన సూపర్ డీలక్స్ త్వరలోనే రిలీజ్ కానున్నది.
naga chaitanya samantha akkineni siva nirvana nc17 movie నాగచైతన్య సమంత అక్కినేని శివ నిర్వాణ ఎన్సీ17 మూవీ


Click it and Unblock the Notifications