సమంత అంటే నాకు రెస్పెక్ట్.. బ్రేకప్ దురదృష్టకరం.. నాగచైతన్య ఎమోషనల్
అక్కినేని నాగచైతన్య, సమంత రుత్ ప్రభు మ్యారేజ్ బ్రేకప్ వ్యవహారం అందర్నీ కలిచి వేసింది. ముఖ్యంగా అక్కినేని, సమంత అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే వారిద్దరి మ్యారేజ్ బ్రేకప్‌పై అనేక ఊహాగానాలు, కథనాలు మీడియాల వెల్లువెత్తాయి. అయితే తమ బ్రేకప్ తర్వాత సమంత, చైతూ చాలా హుందాగా వ్యవహరించారు. అయితే తాజాగా సమంత, రాజ్ నిడిమోరు వివాహం నేపథ్యంలో గతంలో నాగచైతన్య తమ బ్రేకప్, రిలేషన్ షిప్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జర్నలిస్టు ప్రేమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు. నాగచైతన్య చెప్పిన విషయాల్లోకి వెళితే..
సమంతతో సాగిన నా గత జీవితం గురించి నాకు ఎనలేని రెస్పెక్ట్ ఉంది. మా మధ్య బ్రేకప్ జరగడం దురదృష్టకరం. ఆ తర్వాత మా జీవితాలను మేము సాఫీగా కొనసాగిస్తున్నాం. ఒకరిపై మరొకరికి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కానీ మా బ్రేకప్ గురించి రాస్తూ మా జీవితాల్లో జరిగిన విషయాలను హెడ్‌లైన్స్‌గా మార్చకూడదని మీడియాకు నా విన్నపం అని నాగచైతన్య ఎమోషనల్ అయ్యారు.

ఇక గత అనుభవాలను గుర్తు చేసుకొంటూ అక్కడే ఉండిపోలేం. నా ప్రొఫెషనల్ జీవితంలోకి వచ్చి నేను నా ప్రేక్షకులకు, నా అభిమానులకు వినోదాన్ని, కొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తాను. నా కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెడుతాను. జీవితంలో జరిగిన విషయాల గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం అని చైతూ మెచ్యురుడ్డ్‌గా సమాధానం ఇచ్చారు.
బ్రేకప్ తర్వాత నాగచైతన్య తన జీవితాన్ని గాడిలో పెట్టుకొన్నాడు. వ్యక్తిగతంగా శోభితను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్‌గా కూడా సక్సెస్‌ల బాట పట్టారు. యాక్టర్‌గా తన కెరీర్‌ను చక్కదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. త్వరలోనే పిరియాడిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో జరిగిన పరిచయం ప్రేమగా మారడం సమంత జీవితంలో కీలకంగా మారింది. రాజ్ మార్గదర్శకత్వంలో నిర్మాతగా మారి ఆమె విజయాన్ని అందుకొన్నారు. ఇక తాజాగా రాజ్ నిడిమోరుతో వివాహాన్ని డిసెంబర్ 1వ తేదీ 2025న ఇషా యోగా సెంటర్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది.


Click it and Unblock the Notifications











