నా టైం బాగుంది.. ఎట్టకేలకూ కోరిక తీరింది.. నాగచైతన్య ట్వీట్
సెన్సిబుల్ కథలతో ఆకట్టుకొనే శేఖర్ కమ్ముల ఫిదాతర్వాత మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్నశేఖర్ కమ్ముల ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూక్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. మజిలీ లాంటిసూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. తన డైరెక్షన్ లోనే
వచ్చిన ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి
హీరోయిన్‌గా సినిమా అనౌన్స్ అయింది.
డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈచిత్రానికి నిర్మాతలు. ఏషియన్ లాంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్లఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.'

దర్శకుడు శేఖర్ కమ్ముల ఎంచుకున్న నటీనటులు కూడా ప్రాజెక్ట్‌కు సానుకూలంగా మారింది. సెప్టెంబర్ తొలివారంలో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ 2019లో విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నారు. కథ నచ్చడంతో హీరో, హీరోయిన్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాల్షిట్స్ కేటాయించారు. దీంతో కేవలం 60 -70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలాప్లాన్ చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో నటించే ఇతరఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనేతెలియజేస్తామని యూనిట్ తెలిపింది.
నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి శేఖర్ కమ్ములతో వర్క్ చేయాలని అనుకొంటున్నాను. ఎట్టకేలకూ నా కోరిక తీరుతున్నది. ఓ అందమైన ప్రేమ కథతో సినిమాను సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమా సెట్స్‌కు వెళ్తుంది. నా బాగా నడుస్తున్నది. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ అని నాగచైతన్య ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











