తండ్రి మరణంతో విషాదంలో సమంత .. స్పందించని నాగచైతన్య , పెళ్లి పనుల్లో బిజీగా
వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ లైఫ్ లీడ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ సమంతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇక నేను మిమ్మల్ని కలవలేను డాడీ అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీని సామ్ జత చేశారు. నిద్రలోనే గుండెపోటుతో జోసెఫ్ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. జోసెఫ్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సమంతకు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
సమంత ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడానికి ఆమె పార్ట్ టైమ్ జాబ్ కూడా చేశారు. చదువుకుంటూనే పనిచేసి విద్యాభ్యాసం పూర్తి చేశారు. నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతానని సమంత చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ముఖ్యంగా ప్రతి విషయంలో తండ్రి తనకు అండగా నిలిచారని సమంత పలుమార్లు తెలిపారు.

పాన్ ఇండియా హీరోయిన్‌గా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ తల్లిదండ్రుల కోసం ఖచ్చితంగా ఆమె సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇక సమంత ప్రేమ పెళ్లికి కూడా జోసెఫ్ దంపతులు అంగీకరించారు. సామ్ - చైతూ విడిపోయినప్పుడు జోసెఫ్ ఎంతో బాధపడ్డారు. విడాకుల తర్వాత సమంత కృంగిపోకుండా ఆమెకు ధైర్యం చెప్పి జీవితంలో ఇలాంటి ఆటుపోట్లను దాటుకుని తట్టుకుని నిలబడాలని చెప్పేవారు. అయితే కూతురి వైవాహిక జీవితంలో వచ్చిన కుదుపు జోసెఫ్‌పై గట్టి ప్రభావమే చూపించిందని సన్నిహితులు చెబుతుంటారు.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ హనీ బన్నీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో సమంత మంచి జోష్‌లో ఉన్నారు. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లోనూ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. మరిన్ని ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న దశలో తండ్రి హఠాన్మరణం సమంతను కృంగదీసింది. ఈ విషాదం నుంచి ఆమె ఎలా కోలుకుంటారోనని అభిమానులు బాధపడుతున్నారు. సమంతను సన్నిహితులు, ఇతర సినీ ప్రముఖులు ఓదార్చినప్పటికీ ఆమె మాజీ భర్త నాగచైతన్య, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది.

త్వరలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. ఇలాంటి దశలో సమంత తండ్రి మరణించడం దురదృష్టకరమే.. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరూ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో సోషల్ మీడియా వేదికపై నాగ్, నాగచైతన్య ఇతర అక్కినేని కుటుంబ సభ్యులపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని గొడవలున్నా.. ఇలాంటి విషాద సమయంలో సమంతకు అండగా నిలవాలని సూచిస్తున్నారు. మరి ఈ పరిణామాలపై అక్కినేని ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











