Thandel: నాగ చైతన్య మూవీకి తండేల్ టైటిల్.. అసలు దీనికి అర్థం ఏంటో తెలిస్తే!
అక్కినేని నాగేశ్వర్రావు తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి చాలా మందే హీరోలు వచ్చారు. కానీ, వారిలో నాగార్జున తర్వాత మంచి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నది మాత్రం యువ సామ్రాట్ నాగ చైతన్యనే అని చెప్పాలి. అంతలా అతడు క్రమంగా తన రేంజ్‌ను పెంచుకునే సినిమాలు చేస్తున్నాడు. అయితే, 'లవ్ స్టోరి' తర్వాత ఈ హీరోకు హిట్ మాత్రం రాలేదు.
వరుసగా ఫ్లాపులు వస్తున్నప్పటికీ నాగ చైతన్య మాత్రం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో 'ధూత' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ఇది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నాగ చైతన్య చందూ మొండేటి డైరెక్షన్‌లో ఓ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు చందూ మొండేటి దర్శకత్వంలో మత్స్యకారులలకు సంబంధించిన ఓ రియల్ స్టోరీతో సినిమాను చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కే చాలా సమయం పట్టింది. ఆ తర్వాత నాగ చైతన్య కూడా క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేయడం కోసం గ్రౌండ్ వర్క్ చేశాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.
చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. దీనికి 'తండేల్' అనే పేరునే ఖరారు చేశారు. ఇందుకోసం చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో చైతూ గుబురు గడ్డంతో ఊర మాస్ గెటప్‌తో కనిపించాడు. దీంతో ఈ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.
అక్కినేని నాగ చైతన్య సినిమాకు 'తండేల్' అనే టైటిల్ పెట్టడంతో.. అసలు దీని అర్థం తెలియని చాలా మంది జుట్టు పీక్కుంటున్నారు. అయితే, తండేల్ అంటే పడవ నడిపేవాడు అని అర్థం వస్తుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య చేపల వేటకు వెళ్లి జీవనం కొనసాగించే మత్స్యకారుడిగా కనిపించబోతున్నాడు. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్‌ను పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. 'తండేల్' మూవీలో నాగ చైతన్యకు జోడీగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











