Thandel: నాగ చైతన్య కోసం స్టార్ హీరోలు.. సక్సెస్ సంబరాలు చేసినట్లే!
అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి వచ్చి.. తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ఆ మధ్య వరుసగా హిట్లు కొట్టిన అతడు.. ఇటీవలి కాలంలో మాత్రం పరాజయాల పరంపరతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో కాస్త గ్యాప్ కూడా తీసుకున్నాడు.
కొంత కాలంగా ఒక్క హిట్ సినిమాను కూడా సొంతం చేసుకోలేకపోయిన నాగ చైతన్య.. ఇటీవలే 'ధూత' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ఇది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సూపర్ రెస్పాన్స్ రావడంతో హిట్ అయింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు నాగ చైతన్య చందూ మొండేటి డైరెక్షన్‌లో ఓ సినిమాను చేయబోతున్నాడు.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. చందూ మొండేటి దర్శకత్వంలో మత్స్యకారులలకు సంబంధించిన ఓ రియల్ స్టోరీతో సినిమాను చేయబోతున్నాడు. 'తండేల్' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కే చాలా సమయం పట్టింది. ఆ తర్వాత నాగ చైతన్య కూడా క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేయడం కోసం గ్రౌండ్ వర్క్ చేశాడు.
చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న 'తండేల్' సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నేడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి నాగ చైతన్యను ఆశీర్వదించారు.
పూజా కార్యక్రమాల అనంతరం 'తండేల్' హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవిపై వెంకటేష్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు అల్లు అరవింద్‌తో పాటు కొందరు ప్రముఖులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. 'తండేల్' మూవీలో నాగ చైతన్యకు జోడీగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











