ఎన్టీఆర్‌కు పోటీగా అక్కినేని హీరో.. ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చి.. అతి తక్కువ సమయంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు. అందులో కింగ్ నాగార్జున కుమారుడు, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒకడు. ఆ మధ్య వరుస హిట్లతో సత్తా చాటిన అతడు.. తర్వాత ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. కానీ, 'ధూత' సిరీస్‌తో మళ్లీ ట్రాక్ ఎక్కాడు.
'ధూత' వెబ్ సిరీస్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న నాగ చైతన్య ఇప్పుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'తండేల్' అనే మూవీని చేస్తున్నాడు. సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న 'తండేల్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూళ్లను జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 30 శాతం కంటే ఎక్కువ టాకీ పార్టునే కంప్లీట్ చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నారు.
ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'తండేల్' మూవీ షూటింగ్ జరుగుతుండగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదలపై దర్శకుడు చందూ మొండేటి క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ అవుతుందని అతడు వెల్లడించాడు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'తండేల్' మూవీ దసరా కానుకగా విడుదల అవబోతుందనే తాజాగా కన్ఫార్మ్ అయింది. అంటే ఈ సినిమా.. 'దేవర'తో పోటీ పడబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఆ మూవీ అక్టోబర్ 10వ తేదీన రాబోతున్న విషయం తెలిసిందే. ఈ రెండూ దసరా బరిలో ఉంటే అటు నందమూరి, ఇటు అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. 'తండేల్' మూవీలో నాగ చైతన్య సరసన నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే దీని నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది.


Click it and Unblock the Notifications











