Thandel: నడి సముద్రంలో నాగ చైతన్య సాహసం: ఫొటో చూశారంటే షాకవ్వాల్సిందే!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది స్టార్లు తమ వారసులను సినీ రంగానికి పరిచయం చేశారు. అలా వచ్చిన వారిలో అక్కినేని నాగార్జున కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. 'జోష్' అనే చిత్రంతో వచ్చిన అతడు.. ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్నాడు. మధ్యలో కాస్త డౌన్ అయినా మళ్లీ వరుస హిట్‌లను అందుకుని సత్తా చాటుకున్నాడు.
ఈ మధ్య కాలంలో మాత్రం అక్కినేని నాగ చైతన్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అతడు 'ధూత' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ఇది డిసెంబర్ 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సూపర్ రెస్పాన్స్ రావడంతో హిట్ అయింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు.

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న సినిమానే 'తండేల్'. సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే దీన్ని అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను చేస్తూ వచ్చారు.
చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న 'తండేల్' సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్‌ను తాజాగా ప్రారంభించారు. దీన్ని నడి సముద్రంలో ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేసింది.

తాజాగా విడుదలైన 'తండేల్' పోస్టర్‌లో అక్కినేని నాగ చైతన్య అచ్చు గుద్దినట్లు మత్స్యకారుడి లుక్‌తోనే కనిపిస్తున్నాడు. ఇక, ఈ షెడ్యూల్ అంతా నడి సముద్రంలోనే జరుగుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇందులో నాగ చైతన్య కొన్ని రిస్కీ షాట్లు కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతోన్నాయి.
ఇదిలా ఉండగా.. 'తండేల్' మూవీలో నాగ చైతన్యకు జోడీగా నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











