Thandel: ఈపాలి గురి తప్పేదెలేదేస్.. పవర్‌ఫుల్‌గా నాగ చైతన్య తండేల్ టీజర్

టాలీవుడ్‌లోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఆ మధ్య వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. గత చిత్రాలతో మాత్రం సక్సెస్‌లను సొంతం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రయోగాలు చేస్తూనే ముందుకెళ్తున్నాడు.

ఈ మధ్య ట్రాక్ తప్పిన నాగ చైతన్య 'ధూత' వెబ్ సిరీస్‌తో విజయాన్ని అందుకున్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న 'తండేల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. రియల్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు.

Naga Chaitanya and Chandoo Mondeti Thandel Movie Teaser Released

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తోన్న సినిమానే 'తండేల్'. సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే దీన్ని అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి వరుసగా షెడ్యూళ్లను జరుపుతూ చాలా వరకూ చిత్రీకరణ జరిపారు.

'తండేల్' సినిమాకు సంబంధించిన టీజర్‌ను Essence of Thandel పేరుతో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో నాగ చైతన్య సముద్రంలో చేపల వేట సాగించే 'తండేల్ రాజు'గా కనిపించాడు. అతడి లుక్, బాడీ లాంగ్వేజ్, యాస మొత్తం అచ్చుగుద్దినట్లుగా దింపేశాడు. ఫలితంగా ఆరంభంలోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు.

తాజాగా విడుదలైన 'తండేల్' టీజర్‌లో హీరో చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్ కోస్ట్ గార్డులకు దొరకడాన్ని కూడా చూపించారు. అక్కడి జైల్లో చిత్ర హింసలు పెడుతున్నా వాళ్లకు ధీటైన సమాధానం చెప్పేలా నాగ చైతన్య పలికిన డైలాగులు చప్పట్లు కొట్టేలా ఉన్నాయి. చివర్లో సాయి పల్లవి ఎంట్రీ కూడా ఆకట్టుకుంది. మొత్తంగా ఈ టీజర్‌ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంది.

ఇదిలా ఉండగా.. 'తండేల్' మూవీలో నాగ చైతన్య సరసన నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X