షాకింగ్.. అక్కినేని వారసుడితో రష్మిక మందన్న.. సైలెంట్‌గా రివీల్ చేయడంతో!
వరుస సినిమాలతో బిజీగా ఉంది యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న. మరోవైపు అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా అంతే. తమ తమ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు ఈ ఇద్దరూ. అలాంటి ఈ యంగ్ హీరోహీరోయిన్లకు సంబందించిన ఓ వార్త సడెన్‌గా బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఆ వార్త ఏంటి? అధికారికమా లేక పుట్టించిందా..? వివరాల్లోకి పోతే..

మంచి జోష్‌లో ఉన్న అక్కినేని నాగచైతన్య
గతంలో కాస్త తడబాటుకు లోనైనా ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నాడు అక్కినేని నాగచైతన్య. ఇటీవలే భార్య సమంతతో 'మజిలీ' రూపంలో సూపర్ డూపర్ హిట్ తన ల్హాటలో వేసుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఓ వైపు వెంకటేష్‌తో వెంకీమామ సినిమాలో నటిస్తూనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నాడు.

ఇంతలో రష్మిక మందన్నతో..
ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న వెంకీమామ, శేఖర్ కమ్ముల చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. శేఖర్ కమ్ముల- నాగచైతన్య కాంబోలో వస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతలో రష్మిక మందన్నతో నాగచైతన్య కొత్త సినిమా చేస్తున్నాడని పేర్కొంటూ ఆ టైటిల్ కూడా రివీల్ చేయడంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

అదే నువ్వు అదే నేను
హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘బదాయి హో' రీమేక్‌లో యాక్ట్ చేయడానికి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. నాగ చైతన్య, దిల్ రాజు కాంబోలో రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోందని, ఆ సినిమా పేరు ''అదే నువ్వు అదే నేను'' అని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమిని అఫీషియల్‌గా ట్విట్టర్‌లో ప్రకటించింది.
శాటిలైట్ హక్కులు దక్కించుకున్నారు
ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన జెమిని ఛానల్ వారు శాటిలైట్ హక్కులు కూడా తమకే దక్కినట్లు పేర్కొన్నారు. అయితే ఇలా సినిమా దర్శకనిర్మాతలకు బదులు రైట్స్ దక్కించుకున్న ఓ సంస్థ.. ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్ చేయడం ఫస్ట్ టైమ్ అని చెప్పుకోవచ్చు.

మరిన్ని వివరాలు ఎప్పుడో..!
ప్రస్తుతం రష్మిక తెలుగులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బిజీగా ఉంది. నాగచైతన్య కూడా రెండు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. అంటే వీరిద్దరి డేట్స్ కుదిరాకే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని అర్థమవుతోంది. చూడాలి మరి తదుపరి వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో!.


Click it and Unblock the Notifications











